AP Polycet results 2023 announced @ polycetap.nic.in; download rank card now
The results for the AP Polycet-2023 exam have been announced on the official website. Over 1,43,000 students appeared for the exam held on May 10, with a turnout of 89.56%. The results were compiled in just 10 days, showcasing efficient evaluation.
AP Polycet Results 2023...Downloadఆంధ్రప్రదేశ్‌లో పాలిసెట్ 2023 ఫలితాలు విడుదలయ్యాయి. శనివారం ఉదయం రాష్ట్ర ఆర్థిఖ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఏపీలో ఈ నెల 10వ తేదీన పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (పాలిసెట్-2023)ను నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 87 ప్రభుత్వ, 171 ప్రైయివేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో 29 బ్రాంచ్‌లలో మూడేళ్ల డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు ఈ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 1,59,144 మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకోగా 1,43,625 మంది పరీక్షకు హాజరయ్యారు. దరఖాస్తు చేసుకున్న వారిలో 96429 మంది బాలురు, 62715 మంది బాలికలు ఉన్నారు. పరీక్షకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇక పాలీసెట్ లో అభ్యర్థులు సాధించిన ప్రతిభ ఆధారంగా వారికి సీట్లను కేటాయించనున్నారు. పాలిసెట్ ద్వారా ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో మూడేళ్లు, మూడున్నరేళ్ల కాలవ్యవధి గల డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్లను నిర్వహించనున్నారు.
0 Comments:
Post a Comment