Ajay Banga: వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడిగా మనోడు..హైదరాబాద్ లో చదివిన అతడి శాలరీ తెలిస్తే మైండ్ బ్లాక్ అవడం ఖాయం
Ajay Banga: భారత సంతతికి చెందిన చాలా మంది ఇతర దేశాలు, అంతర్జాతీయ సంస్థల్లో అత్యున్నత పదవుల్లో ఉన్నారు. గూగుల్ సీఈవోగా సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సేవలందిస్తుండగా, తాజాగా ఓ భారతీయ అమెరికన్ తొలిసారిగా ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు.
ఆయన పేరే అజయ్ బంగా(Ajay Banga). జూన్ 2న వరల్డ్ బ్యాంక్(World bank president) అధ్యక్షుడిగా బాధ్యతలను చేట్టనున్నారు. మరి ఆయనకు సంబంధించిన వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం.
* హైదరాబాద్‌లో స్కూల్ ఎడ్యుకేషన్
అజయ్ బంగా తండ్రి హర్భజన్ బంగా ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్. దీంతో అజయ్ బంగా అనేక భారతీయ నగరాల్లో పెరిగారు. అతని కుటుంబ స్వస్థలం పంజాబ్‌లోని జలంధర్. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో పదో తరగతి వరకు చదువుకున్నారు. ఢిల్లీ యూనివర్సిటీ అనుబంధ కళాశాల సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ నుంచి ఎకనామిక్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (ఆనర్స్) పూర్తిచేశారు. తర్వాత అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీ చేశారు.
* మాస్టర్‌కార్డ్ సీఈవోగా సేవలు
అజయ్‌పాల్ సింగ్ బంగా తన బిజినెస్ కెరీర్‌ను 1981లో నెస్లేతో ప్రారంభించారు. దాదాపు దశాబ్ధం పైగా అక్కడ వివిధ హోదాల్లో పనిచేశారు. ఆ తరువాత మాస్టర్‌కార్డ్ సీఈవోగా కూడా పనిచేశారు. డచ్ ఇన్వెస్ట్‌మెంట్స్ హోల్డింగ్ సంస్థ ఎక్సోర్‌కు కీలకమైన ఛైర్మన్‌గా కూడా అజయ్ బంగా సేవలందించారు. ప్రస్తుతం ఈక్విటీ కంపెనీ జనరల్ అట్లాంటిక్‌కి వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
* సంపద వివరాలు
సీఎన్‌బీసీ ప్రకారం.. 2021లో అజయ్ బంగా సంపద నికర విలువ $206 మిలియన్లు (రూ.1700 కోట్లు). అజయ్ బంగా సీఈవోగా ఉన్న సమయంలో మాస్టర్‌కార్డ్ స్టాక్స్ విలువ $113,123,489. అతను గత 13 ఏళ్లుగా వేల డాలర్ల విలువైన స్టాక్‌లను విక్రయించారు. మాస్టర్‌కార్డ్‌లో అజయ్ బంగా వార్షిక వేతనం $23,250,000. ఇది భారతీయ కరెన్సీలో దాదాపు రూ.192,32,46,975కు సమానం. ఆ లెక్కన రోజుకు రూ.52 లక్షల వేతనాన్ని పొందారు.
* నాలుగు గంటల పాటు ఇంటర్వ్యూ
ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ బోర్డు.. బంగాను 4 గంటల పాటు ఇంటర్వ్యూ చేసింది. ఈ ప్యానెల్‌లో 25 మంది సభ్యులు బంగాను ప్రశ్నలు అడిగారు. ఈ ఇంటర్వ్యూ తర్వాత.. బంగాను వరల్డ్ బ్యాంక్ చైర్మన్‌గా ఎంపికచేసినట్లు బోర్డ్ ప్రకటించింది. 'అజయ్ బంగా సారథ్యంలో పనిచేసేందుకు ఎంతో ఉత్సాహం చూస్తున్నాం. అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించాలన్న లక్ష్యంగా ప్రపంచ బ్యాంకు నిర్దేశించుకున్న లక్ష్యాలను బంగా నెరవేరుస్తారని ఆశిస్తున్నాం.' అని ఎగ్జిక్యూటివ్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.
0 Comments:
Post a Comment