✍️36 వేలమంది టీచర్ల తొలగింపు...
🌻కోల్ కతా: ఉపాధ్యాయుల నియామకాల్లో కుంభకోణం కేసులో కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాల్లో గతంలో నియమితులైన 36 వేల మంది ఉపాధ్యాయ నియామకాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. నియామక ప్రక్రియలో విధివిధానాలను పాటించలేదని పేర్కొంటూ వీరి నియామకాలను రద్దుచేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ ఆదేశాలు జారీ చేశారు. "పశ్చిమ బెంగాల్లో 2016లో నియమితులైన 36 వేలమంది ఎలాంటి శిక్షణా తీసుకోకుండా నియమితులయ్యారు. కాబట్టి వీరి నియామకాలు చెల్లవు" అని జస్టిస్ గంగోపాధ్యాయ పేర్కొన్నారు. ఈ మేరకు 17 పేజీ ల తీర్పును వెలువరించించారు. రాబోయే మూడు నెలల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. అదే సమయంలో తొలగించిన ఉపాధ్యాయులు నాలుగు నెలల పాటు పనిచేయొచ్చని, కానీ పారా టీచర్లకు ఇచ్చే జీతానికి పనిచేయాలని ఆదేశించారు. పశ్చిమ బెంగాల్లో ఇంతటి అవినీతిని తానెన్నడూ చూడలేదని < జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ పేర్కొన్నారు. స్కూల్ జాబ్ ఫర్ క్యాష్ స్కామ్ > పేర్కొనే ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి పార్థాఛటర్జీ, ప్రైమరీ ఎడ్యుకేషన్ మాజీ ఛైర్మన్ మాణిక్ భట్టాచార్య అరెస్ట్ అయ్యారు. మరోవైపు హైకోర్టు తీర్పుపై పశ్చిమ బెంగాల్ సర్కారు స్పందించింది. సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై న్యాయ నిపుణుల సలహా తీసుకుంటామని, అనంతరం ఆదేశాలను సవాలు చేయనున్నామని తెలిపింది.
0 Comments:
Post a Comment