300 Varieties Of Mango : ఒక్క చెట్టుకు 300రకాల మామిడి పండ్లా.. ఎక్కడ?
300 Varieties Of Mango : వేసవి వచ్చిందంటే చాటు మామిడి పండ్లు మార్కెట్లోకి వస్తాయి. ప్రతి ఒక్కరు వాటిని తినేందుకు ఆసక్తి కనబరుస్తారు. బంగినపల్లి, తోతాపురి, రసాలు ఇలా మామిడిలో చాలా రకాలున్నాయి.
కానీ ఇవన్నీ వేరు వేరు చెట్లకు కాస్తాయి. కానీ ఒకే చెట్టుకు 300రకాలమామిడి పండ్లు పండితే ఎలా ఉంటుంది.. కోరుకున్న పండును కావలిన టైంలో తినేయవచ్చు కదా.. ఆ ఊహే ఎలా ఉంది.. బాగుంది కదా.. ఈ చెట్టు ఎక్కడుంది దాని ప్రత్యేకత తెలుకుందాం.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. లక్నో నగరంలో ప్రత్యేకంగా మాట్లాడుకునే మామిడి చెట్టు ఉంది. ఈ మామిడి చెట్టు ప్రత్యేకత ఏమిటంటే ఈ ఒక్క చెట్టుపైనే దాదాపు 300 రకాల మామిడి పండ్లు పండుతాయి. ఈ చెట్టు లక్నోకు కొన్ని కిలోమీటర్ల దూరంలో మలిహాబాద్ చౌక్ సమీపంలో ఉంది.లక్నో నగరానికి చెందిన హాజీ కలీమ్ ఉల్లాఖాన్ అనే వ్యక్తి ఎంతో శ్రమతో ఒక చెట్టును కనుగొన్నాడు, ఇది చూపరులను ఆశ్చర్యపరిచింది. గ్రాఫ్టింగ్ టెక్నాలజీని ఉపయోగించి, అతను 300 రకాల మామిడిని పండించే చెట్టును కనుగొన్నాడు. ఈ చెట్టు రహస్యాన్ని తెలుసుకునేందుకు జపాన్ నుంచి వచ్చిన బృందం కూడా ఇక్కడికి వచ్చింది. ఈ విశిష్ట పనికి గాను హాజీ కలీమ్‌ను అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ పద్మశ్రీ అవార్డుతో సత్కరించారు.
మ్యాంగో మ్యాన్ ఆఫ్ ది వరల్డ్
హాజీ కలీం సాహెబ్ 17 సంవత్సరాల వయస్సులో ఒక మొక్కను కనుగొన్నారు. దాని నుండి సుమారు 7 రకాల మామిడి పండ్లను పండించారు. అంతే కాదు, హాజీ కలీమ్ సాహెబ్ మామిడిపండ్లపై చేసిన కృషి వల్ల ప్రపంచంలోనే మ్యాంగో మ్యాన్ అని కూడా పిలుస్తారు. ఈ వింత చెట్టుపై ఏ మామిడి పండ్లను పండించినా వాటిని అమ్మకుండా ప్రజలకే పంచుతున్నారు. హాజీ కలీమ్ సాహెబ్ మామిడి చెట్టు మొత్తం కళాశాలగా అభివర్ణించారు. దానిలో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. మామిడి చెట్టును సరిగ్గా ఉపయోగించుకుంటే క్యాన్సర్, ఎయిడ్స్ వంటి ప్రాణాంతక వ్యాధులు కూడా నయం అవుతాయని హాజీ కలీమ్ సాహెబ్ చెప్పారు. మ్యాంగో మ్యాన్ ఆఫ్ ది వరల్డ్ గా పేరుగాంచిన ఈ వ్యక్తి 7వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. నేడు పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు కూడా అతనిని సంప్రదించడానికి వస్తున్నారు.
0 Comments:
Post a Comment