మిస్టరీ నిచ్చెన.. 266 ఏళ్లుగా ఒకే చోట.. దాన్ని పక్కకు తీస్తే..
ఇప్పుడంటే నిచ్చెనల వాడకం తగ్గింది కానీ, ఒకప్పుడు ఏదైనా ఎత్తు మీదకు ఎక్కడానికి నిచ్చెలను వాడేవారు. చెక్క, ఇనుముతో చేసిన నిచ్చెనలు అందుబాటులో ఉండేవి.
మెట్లు లేని ఇళ్లకు నిచ్చెనే మెట్లుగా పని చేసేది. ఇప్పుడు ఎక్కడో ఓ చోట అరుదుగా మాత్రమే నిచ్చెనలు కనిపిస్తున్నాయి. అది కూడా ఏదైనా మారు మూల గ్రామంలో అయితేనే నిచ్చెనలు వాడుతున్నారు. అవసరానికి తగ్గట్లు దాన్ని అటు,ఇటు మారుస్తూ వాడుతూ ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీలోని నిచ్చెన మాత్రం అలా కాదు.. దాదాపు 266 ఏళ్లుగా ఒకే చోట ఉంటోంది. దాన్ని పక్కకు కదిలించే సాహసం ఎవరూ చేయటంలేదు.
అదలా ఒకే చోట ఉండటానికి ఓ బలమైన కారణం ఉంది. ఇంతకీ ఏంటా స్టోరీ అంటే.. క్రిష్టియన్లు ఎంతో పవిత్రంగా భావించే జెరుసలీమ్‌లోని చర్చ్ ఆఫ్ హోలీ సెపుల్‌చర్‌లోని గోడకు ఓ నిచ్చెన ఆనించి ఉంటుంది. ఆ నిచ్చెన 1700 సంవత్సరం నుంచి అక్కడే ఉంది. అక్కడి వారు దాన్ని ఇప్పటివరకు ఒక్కసారి కూడా పక్కకు కదిలించలేదు. ఆ ఆలోచన కూడా ఎవ్వరూ చేయలేదు. దాదాపు 266 ఏళ్లుగా ఆ నిచ్చెన అక్కడే ఉంటోంది. దాన్ని పక్కకు జరపకపోవటానికి ఓ బలమైన కారణం ఉందని అంటున్నారు అక్కడి వారు. దాన్ని గనుక అక్కడినుంచి పక్కకు తీస్తే మత విద్వేషాలు పెరుగుతాయట. గొడవలు జరిగే అవకాశం ఉందట.
ఇందుకు ఓ ప్లాష్ బ్యాక్ కూడా ఉంది. గతంలో క్రిష్టియన్లు.. ఇతర మతాల వారు మా మతం గొప్పదంటే.. మా మతం గొప్పదని గొడవలు పడేవారట. ఈ నేపథ్యంలోనే.. ఓటోమన్ ఎంఫైర్, యూరోపియన్ నేషన్స్ కలుగజేసుకుని గొడవల్ని ఆపారు. నిచ్చెన ఉన్న ప్రదేశంలోని ఏ వస్తువును కదల్చకూడదని నిబంధన తెచ్చారు. అయితే, 1997లో ఓ వ్యక్తి నిచ్చెనను కదిల్చాడు. దీంతో అక్కడి అధికారులు నిచ్చెన ఉండే కిటికీకి తెరను ఏర్పాటు చేశారు.
0 Comments:
Post a Comment