కారులో ఏసీ వాడితే పెట్రోల్ ఔట్.. 1 గంట ఆన్ చేస్తే.. ఎంత ఫ్యూయల్ అవుతుందో తెలుసా?
మీరు ఎండాకాలంలో కారులో ప్రయాణిస్తున్నట్లయితే...
ఆటోమేటిక్‌గా మీకు ఏసీ ఆన్ చేసుకోవాలని అనిపిస్తుంది. మన దేశంలో ఎండల తీవ్రత ఎక్కువ కాబట్టి.. కార్లలో ఏసీ వాడకం ఎక్కువే. ఎయిర్ కండీషన్ లేని కారులో ప్రయాణించడం చాలా కష్టం. (Image credit - mgmotor)
కారులోని ఏసీ... పెట్రోల్ నుంచి ఉత్పత్తయ్యే ఎనర్జీతో పనిచేస్తుంది. మరి ఏసీ వాడకం వల్ల ఎంత పెట్రోల్ ఖర్చవుతుంది? ఓ గంట ఏసీ ఆన్ చేస్తే.. పెట్రోల్ ఎంత అయిపోతుంది అనే విషయం తెలుసుకుందాం.
ఇది అన్ని కార్లకూ ఒకే విధంగా వర్తించదు. ఇందులో అనేక అంశాలుంటాయి. కారు ఇంజిన్ సైజు ఎంత ఉంటుంది, ఏసీ పనితీరు ఎలా ఉంది, బయటివైపు ఉష్ణోగ్రత ఎలా ఉంది, కారు వేగం ఎంత అనే అంశాల ఆధారంగా.. ఏసీ ఎంత పెట్రోల్ వాడుతుంది అనేది ఆధారపడి ఉంటుంది.
ఓ రిపోర్ట్ ప్రకారం 1 గంట పాటు AC వాడితే... 1.2 లీటర్ల పెట్రోల్ ఖర్చు అవుతుంది. అలాగే... కారులో ఏసీని వాడటం వల్ల కారు మైలేజీ 5 నుంచి 10 శాతం తగ్గుతుందని ఆటోమొబైల్ ఇండస్ట్రీ నిపుణులు చెబుతున్నారు.
మరో విధంగా చెప్పాలంటే.. కారులో వెళ్తూ ఏసీ ఆన్ చేసుకుంటే.. పెట్రోల్ వాడకం దాదాపు 20 శాతం పెరుగుతుంది. ఏసీలో కంప్రెసర్ రన్ అయ్యేందుకు ఈ పెట్రోల్ అయిపోతుంది. ఏసీకి పవర్ ఇచ్చేందుకు ఇంజిన్ ఎక్కువ కష్టపడాల్సి వస్తే.. ఫ్యూయల్ వాడకం కూడా ఎక్కువగా అయిపోతుంది.
ఏసీ ఆన్ చేసి.. అతి వేగంతో కారును నడుపుతున్నా... లేక ట్రాఫిక్ జామ్‌లో ఆగి ఆగి నడుపుతున్నా... ఏసీ కోసం పెట్రోల్ వాడకం ఎక్కువ అవుతుంది.
మొత్తంగా ఏసీ అత్యవసరం అనిపించినప్పుడు మాత్రమే వాడటం మేలు. వీలైనంతవరకూ కారు విండో డోర్లను ఓపెన్ చేయడం ద్వారా వచ్చే గాలితో ఎడ్జస్ట్ అవ్వడం బెటర్. అలాగే.. కారు టైర్లలో ప్రెషర్ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. కారులో అనవసరమైన వస్తువుల్ని తొలగించాలి. కారును స్థిరమైన వేగంతో నడిపితే.. ఫ్యూయల్ వాడకం తగ్గుతుంది.
0 Comments:
Post a Comment