యూట్యూబ్ వీడియోస్‌కు లైక్ కొడితే..రూ. 8.5 లక్షలు పోయాయి..
ఆన్ లైన్ మోసాలు ఆగడం లేదు. ఎక్కడా చూసిన సైబర్ క్రైమ్ దందాలే. చదువు లేని వారు కాదు. చదువకున్న వాళ్లు, స్మార్ ఫోన్స్ వాడుతున్నవారే టార్గెట్.
ఒక్కే ఒక్క క్లిక్‌తో లక్షలు దోపిడీ. ఎంత అవగాహన పరిచినా లాభం లేకుండా పోతోంది. కొత్త దారుల్లో వస్తున్న సైబర్ నేరగాళ్లకు కష్టపడి సంపాదించిన సొమ్మును అప్పజెప్పేస్తున్నారు. అత్యాశతో కొందరు, అవగాహన లేక మరికొందరు చేయకూడని తప్పులను చేస్తున్నారు. నమ్మకూడని మాటలను నమ్మేస్తున్నారు. తాజాగా యూట్యూబ్ లైక్స్ పేరుతో నయా దందా మొదలైంది.
మా యూట్యూబ్ వీడియోస్‌కు లైక్ కొట్టండి.డబ్బులను పొందండి అంటూ ఓ మహిళను బురిడీ కొట్టించారు సైబర్ నేరగాళ్లు. అలా కొన్ని వీడియోస్‌కు లైక్ కొట్టాక మీకు రావాల్సిన డబ్బులు కోసం మీరు కొంత నగదును డిపాజిట్ చేయాలని నమ్మించారు. మాటల్లో పెట్టి తమ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలని కూడా సూచించారు. అలా విడతల వారిగా రూ.8.5 లక్షలను దోచేశారు. తర్వాత వారి నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో చివరికి మోసపోయినట్లు గ్రహించిన ఆమె పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు నమోదైన మోసాల్లో ఇది కొత్త తరహా మోసమని పోలీసులు తెలిపారు. సైబర్ నేరగాళ్ల వలలో పడి మోసపోవద్దంటూ ప్రజలకు సూచించారు. మోసపోయిన మహిళ పేరు సిమ్రంజీత్ సింగా కాగా ఆమె హర్యానాలోని గురుగ్రామ్ ప్రాంతంలో నివాసం ఉంటోంది.
0 Comments:
Post a Comment