World Malaria Day 2023: నేడే ప్రపంచ మలేరియా దినోత్సవం, ఎందుకు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారో తెలుసా?
World Malaria Day 2023: ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా మలేరియా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సారి ఏప్రిల్ 25 (ఈ రోజున) వచ్చింది.
ఆడ అనాఫిలిస్ దోమలు కుట్టడం వల్ల మలేరియా వ్యాధి వస్తుంది. ప్రస్తుతం ఇది ప్రాణాంతక వ్యాధిగా మారింది. వర్షం లేదా వాతావరణంలో తేమ కారణంగా మలేరియా దోమలు పెరుగుతాయి. అయితే ప్రస్తుతం ఈ వ్యాధి పిల్లలో ప్రాణాంతకంగా మారుతోంది. కాబట్టి ఇంటి పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
మలేరియా సాధారణంగా జ్వరం, తలనొప్పి, వాంతులు, చలి, అలసట, తల తిరగడం, కడుపు నొప్పి వంటి లక్షణాలతో వస్తుంది. మలేరియా చికిత్సలో దాదాపు రెండు వారాల పాటు మందులు వాడాల్సి ఉంటుంది. ఈ వ్యాధి బారిన పడితే నిర్లక్ష్యం చేయకుండా ఉండాలి. భారతదేశంలో ప్రతి సంవత్సరం వేలాది మలేరియా కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం చాలా మంది మలేరియా కారణంగా మరణిస్తున్నారు. మలేరియాను ఎలా నివారించాలో అనే దానిపై అవగాహన కల్పించడానికి ప్రపంచవ్యాప్తంగా మలేరియా దినోత్సవాన్ని జరుపుకుంటారు. మలేరియా దినోత్సవం ఎప్పుడు, ఎక్కడ ప్రారంభమైందో తెలుసుకుందాం.
మలేరియా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?:
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని 2007 సంవత్సరం నుంచి జరుపుకోవడం ప్రారంభించారు. అయితే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా మలేరియా గురించి అవగాహన కల్పిస్తారు.
మలేరియా దినోత్సవం చరిత్ర ?
ప్రపంచ ఆరోగ్య సంస్థ 2007లో ప్రపంచవ్యాప్తంగా మలేరియా దినోత్సవాన్ని జరపాలని నిర్ణయించింది. ఆఫ్రికా దేశాల్లో తొలిసారిగా మలేరియా దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఆ సమయంలో ఆఫ్రికన్ దేశాలలో మలేరియా మరణాల ఎక్కువగా జరిగేవని, అక్కడ నివసిస్తున్న ప్రజలకు 2007నుంచి అవగాహన కల్పించడం వల్ల మరణాలు తగ్గుతూ వచ్చాయని డబ్లూహెచ్‌ఓ పేర్కొంది. అందుకే ప్రపంచ మలేరియా దినోత్సవం ప్రారంభించారని నిపుణులు చెబుతున్నారు.
మలేరియా దినోత్సవం థీమ్:
ప్రతి సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ మలేరియా దినోత్సవం ప్రత్యేక థీమ్‌పై కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం మలేరియా దినోత్సవం 2023 థీమ్ 'మలేరియాను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి'. అని ప్రజల అవగాహన కల్పించాలని కార్యచరణను పేర్కొంది.
0 Comments:
Post a Comment