Wonder in Beach: విశాఖ సాగర తీరం (Vizag Beach) లో నీలి కాంతులతో అలలు ఆకట్టుకుంటున్నాయి. భీమిలి బీచ్ (Bheemili Beach) పరిధిలో రాత్రి వేళల్లో కనిపిస్తున్న ఈ అరుదైన దృశ్యాన్ని చూడటానికి నగర యువత క్యూ కడుతున్నారు.
గత కొన్ని రోజులుగా కైలాసగిరి నుంచి భీమిలి (Kailasagiri to Bhemili Beach)వరకు సాగర తీరంలో అక్కడక్కడా ఇలా కనిపిస్తున్నాయని కొందరు చెబుతున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి వింత కాంతి చూడలేదు అంటున్నారు.
కేవలం ఒక్క ప్రదేశంలోనే కాదు.. భీమిలీలోని తీర ప్రాంతం పొడవునా ఈ వెలుగులు కనిపించాయి అంటున్నారు. ఆ కాంతులను చూసి సందర్శకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సముద్రం ఒడ్డున తీరానికి చేరుకునే అలలు.. వెన్నుల వెలుగుల్లో నీలం రంగులో మెరిసిపోయాయి.
చూసిన వారంతా ఏంటి ఈ అద్భుతం అంటున్నారు. ఎన్నడూ లేనిది సముద్రం అలలు నీలం రంగులో మెరిసిపోవడం విశాఖలో ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మరింది. ఎక్కడైతే సముద్ర అలలు నీటి తాకుతున్నాయో.. అక్కడఆ ప్రదేశం అంతా నీలంగా మారిపోవడం సందర్శకులను మరింత ఆశ్చర్యానికి గురి చేసింది.
రాత్రి 8 గంటల తరువాత విశాఖ-భీమిలీ బీచ్‌లో ఈ వింత వెలుగు కనిపించాయి అంటున్నారు. తీర ప్రాంతం పొడవునా అదే తరహా కాంతులు కనిపించాయి.
ఈ వింత గురించి తెలిసిన వెంటనే సందర్భకుల సంఖ్య మరింత పెరిగింది. ఆ నీలి రంగు కాంతిని తిలకించడానికి విశాఖ నగర వాసులు కూడా పెద్ద సంఖ్యలో తీర ప్రాంతానికి చేరుకున్నారు. కొందరు వీడియోలు సైతం తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఆ సమయంలో సముద్రం మీదుగా వీచే గాలుల్లో కూడా అసాధారణంగా ఉన్నట్లు సందర్శకులు చెబుతున్నారు. కొద్దిసేపు చల్లగా, మళ్లీ క్షణాల్లోనే వేడిగా గాలులు వీచాయని చెప్పుకొచ్చారు. ఇలా ఎప్పుడూ జరగలేదని సందర్శకులు చెబుతున్నారు.
నిజానికి సముద్ర జలాల్లో చేపలు, నత్తలు, పీతలతోపాటు యాల్జీ, జెల్లిఫిష్ వంటి ఇతర జీవులు కూడా నివసిస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. వీటిల్లో బయోలూమినెస్సీన్స్ అనే సముద్ర జీవుల వల్ల సముద్రం నీలం రంగును సంతరించుకుని ఉంటాయని నిపుణులు చెబుతుంటారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు ఎంటెక్ విద్యార్థులు సైతం తీరంలో ఈ కాంతులను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. అయితే వీటిని 'బయోల్యూమినిసెన్స్' తరంగాలు అంటారని, ఇలాంటివి కొచ్చిన్ తీర ప్రాంతంలో జూన్, జులై, ఆగస్టు నెలల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయని, తూర్పుతీరంలో ఇదే మొదటిసారి అని ఓషనోగ్రఫీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇవి సాధారణంగా రెండు వారాలపాటు కనిపించే అవకాశం ఉంటుందన్నారు.
చేపలకు ప్రమాదం.
సముద్రంలో ఆల్గే (శైవలాలు) ఎక్కువగా పెరగడం వల్ల బయోల్యూమినిసెన్స్ వస్తాయని సముద్ర శాస్త్ర అధ్యాయన పరిశోధకులు చెబుతున్నారు. ఆల్గేలో జరిగే ఒక రసాయన చర్య వల్ల నీలి రంగు వస్తుందంటున్నారు.
సముద్రంలో కలుస్తున్న కాలుష్యంతో ఫైటోప్లాంటెన్ వంటి శైవలాలు వేగంగా వృద్ధి చెందుతాయంటున్నారు. సముద్ర వాతావరణంలోని సీవో-2 పీల్చుకుని శైవలాలు, ఈ శైవలాలను తిని చిన్నచిన్న జీవులు జీవిస్తాయన్నారు.
అయితే ఇవి ఎక్కువగా వృద్ధి చెందితే.. చేపల గిల్స్ (గాలి పీల్చుకునే) రంధ్రాలు మూసుకుపోయి మృతి చెందడానికి ఆస్కారం ఉంటుందన్నారు. ఈ శైవలాలు ఎక్కువగా ఉన్న చోట చేపలు దూరంగా ఉంటాయని, ఇది విషపూరితం కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
0 Comments:
Post a Comment