ఏజ్ ఇజ్ జస్ట్ ఏ నంబర్ అని నిరూపించాడు ఈ 72ఏళ్ల వృద్ధుడు.
ప్రపంచ ఏడు వింతల్లో ఒకటైన ఈఫిల్ టవర్‌ను అగ్గిపుల్లలతో నిర్మించాడు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన సురేంద్ర జైన్ 72 ఏళ్ల వయసులో తన సృజనాత్మకతను వెలికి తీశారు. 75వేల అగ్గిపుల్లలతో ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటైన పారిస్‌లోని ఈఫిల్ టవర్‌ని మేక్ చేశారు.
సురేంద్ర జైన్ కి పార్తాపుర్లో ఓ పిండి మిల్లు ఉంది. అయితే జైన్ చదువుకునే రోజుల్లో.. అతడి తల్లి చదువుతో పాటు వేరే ఏదైనా చేసి గుర్తింపు తెచ్చుకోమనేది.
దీంతో జైన్ చిన్నప్పుడే అగ్గి పుల్లలతో ఈఫిల్ టవర్‌ను నిర్మించాలని నిర్ణయించుకున్నాడు.
సురేంద్ర తన కలను సాకారం చేసుకునే ప్రయత్నంలో 2013లో పారిస్‌కు కూడా వెళ్లాడు. అతను రెండు రోజులు టవర్ బేస్ వద్ద కూర్చొని వాస్తుశిల్పంలోని అద్భుతాన్ని గమనించాడు. ఆ అద్భుతాన్ని చూసిన పదేళ్ల తర్వాత తన కలను సాకారం చేసుకునే ప్రయత్నం ప్రారంభించాడు.
వృద్ధాప్యం కారణంగా పని చేస్తున్నప్పుడు చేతులు వణికిపోయేవి. యోగాసనాలు వేయడం ద్వారా చేతి వణుకు తగ్గిందని సురేంద్ర చెబుతున్నారు.
2019లో, అగ్గిపుల్లలను కలుపుతూ మోడల్‌లను తయారు చేయడం ప్రారంభించానని.. మూడేళ్ల పాటు కష్ట పడితే అది ఈ ఏడాది పూర్తయింది
ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తన పేరు నమోదు కావడం చాలా సంతోషంగా ఉందని జైన్ చెప్పారు.
కానీ అతను ఈ ఈఫిల్ టవర్‌ను నిర్మించడం ప్రారంభించినప్పుడు, అతను దానిని రికార్డ్ చేయడం కోసం కాకుండా తన సెల్ప్ సంతృప్తి కోసం చేశానని చెప్పారు.
0 Comments:
Post a Comment