White Hair Problem: చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఇది మీ కోసమే!
Home Remedies for Black Hair: చెడు జీవనశైలి కారణంగా చిన్న వయస్సులోనే జుట్టు సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా చాలా మందిలో తెల్ల జుట్టు సమస్యలు వస్తున్నాయి.
కాబట్టి ఇలాంటి సమస్యలున్నవారు మానసికంగానూ బాధపడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. అయితే తెల్ల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్‌లో లభించే రసాయనాలతో కూడిన ప్రోడక్ట్స్ వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించడం వల్ల జుట్టు సమస్యలు తీవ్రంగా పెరుగుతున్నాయన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి వీటికి బదులుగా ఇంటి చిట్కాలతో తయారు చేసిన రెమిడీస్‌ను వినియోగించడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే ఎలాంటి చిట్కాలను పాటించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
జుట్టు నెరిసిపోయిన జుట్టును మళ్లీ మెరిపించుకోవడానికి తప్పకుండా రెండు రకాల చిట్కాలను వినియోగించాలని నిపుణులు చెబుతున్నారు. వాటిని వినియోగించడం వల్ల సులభంగా తెల్ల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మొదటి పద్ధతి హెన్నా, కొబ్బరి నూనెను మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయడం, రెండవ పద్దతి గోరింట ఆకులను ఎండలో ఉంచి వాటిని పొడిలా చేసి, నూనెలో వేసుకుని జుట్టు అప్లై చేయడం. ఇలా రెండు పద్ధతుల ద్వారా సహజంగా తెల్ల జుట్టును నల్లగా చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: Turn White Hair to Black in 5 Days: తెల్ల జుట్టును 5 రోజుల్లో నల్లగా మార్చే కలబంద మరియు ఆలివ్ ఆయిల్
మొదటి పద్దతి:
ఈ రెసిపీని తయారు చేసుకొవడానికి ముందుగా ఒక కప్పు గోరింట ఆకులను తీసుకోవాల్సి ఉంటుంది. వాటిని కడిగి కొద్ది సేపు ఎండలో పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత కొబ్బరి నూనె బౌల్ వేసి మరిగించి అందులో ఈ గోరింట ఆకులను వేసి బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత నూనెను బాగా వడకట్టుకుని ఓ బాటిల్ పోసుకోని క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
రెండవ పద్ధతి:
ముందుగా కొబ్బరి నూనె బౌల్ వేసి బాగా వేడి చేయాలి. అందులో హెన్నా పౌండర్‌ను వేసి బాగా మిక్స్ చేయాలి. అలా మిక్స్ చేసిన తర్వాత జుట్టుకు అప్లై చేసి రెండు గంటల తర్వాత శుభ్రం చేసుకుంటే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి తెల్ల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలగడమేకాకుండా జుట్టు రాలడం తగ్గుతుంది. కాబట్టి తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ రెండు పద్ధతులను వినియోగించాల్సి ఉంటుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. మన్నం వెబ్ దానిని ధృవీకరించలేదు.)
0 Comments:
Post a Comment