Weight Loss Tips: 8 రోజుల్లో బరువు తగ్గొచ్చా, ఈ ఒక్క గ్లాసు నీరు తాగితే ఫలితాలు ఖాయమేనా?
Jeera Water For Weight Loss: ఆధునిక జీవనశైలి కారణంగా చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అందులో చాలా మంది బరువు పెరుగుతున్నారు.
అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా వ్యాయామాలు కూడా చేయాల్సి ఉంటుంది. ఇలాంటి సమస్యల నుంచి జీరా వాటర్ తాగడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు బరువు తగ్గించడమేకాకుండా శరీరంలో కొలెస్ట్రాల్‌ను కూడా సులభంగా నియంత్రిస్తుంది. కాబట్టి ఈ నీటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
జీలకర్ర ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం:
జీలకర్రలో ఉండే గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే పోషక గుణాలు అనేక తీవ్రమైన వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. కాబట్టి దీనిని వినియోగించడం వల్ల అనేక తీవ్రమైన వ్యాధులకు కారణమయ్యే వాపులను కూడా సులభంగా నియంత్రిస్తుంది.
జీలకర్ర నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
జీలకర్రను క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. అంతేకాకుండా జీలకర్ర నీటిలో ఉండే మూలకాలు బరువు తగ్గించడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. రక్తపోటు సమస్యలతో బాధపడేవారు దీనిని జీలకర్ర నీటిని తాగడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
ఖాళీ కడుపుతోజీలకర్ర నీటిలో తేనె కలిపి తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి సీజనల్ వ్యాధులను తగ్గించడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
ఈ నీటిని ప్రతి రోజూ తాగడం వల్ల గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యలు కూడా దూరమవుతాయి.
జీలకర్ర నీటితో ఉండే గుణాలు చర్మ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తుంది.
మొటిమలు, అలెర్జీ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ నీటిని తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి.
జీలకర్ర నీటిని ఇలా తయారు చేసుకోండి:
ముందుగా ఒక టీస్పూన్ జీలకర్రను తీసుకోవాలి..దానిని ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టండి.
తర్వాత ఉదయాన్నే మరిగించి నీటిని బయటకు తీయాల్సి ఉంటుంది.
తీసిన జీలకర్రను ఖాళీ కడుపుతో తినవచ్చు.
ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ అదుపులతో ఉంటుంది.
0 Comments:
Post a Comment