చాలా మంది తమ తమ ఇళ్లలో ఉదయం టిఫిన్‌గా, రాత్రి డిన్నర్‌గా చపాతీలు చేసుకుని తింటుంటారు.
అయితే, కొన్నిసార్లు పిండి అవసరానికి ఎక్కువగా కలుపుతుంటారు. అలా మిగిలిన పిండిని మరుసటి రోజు వినియోగించేందుకు ఫ్రిజ్‌లో పెడుతుంటారు.
అయితే, అలా ఫ్రిజ్‌లో పెట్టిన పిండి ఫ్రెష్‌గా ఉండదనే విషయం అందరికీ తెలిసిందే. కలిపి పెట్టిన పిండిని, ఫ్రిజ్‌లో పెట్టడం వలన గట్టి పడుతుంది.
మరి ఇలా గట్టి పడకుండా ఉండటానికి ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ టిప్స్ ద్వారా పిండిని ఫ్రిజ్‌లో పెట్టినా ఫ్రెష్‌గా, మెత్తగా ఉంటుంది.
పిండి ప్రెష్‌గా ఉండాలంటే..
1. పిండిని కలిపేటప్పుడు గోరువెచ్చని నీరు కలపడం ఉత్తమం. చల్లని నీటితో పిండి కలపితే.. ఆ పిండినంతటినీ వెంటనే వినియోగించాలి. లేదంటే అది గట్టిపడుతుంది. ఇక వేడి నీటితో పిండి కలిపి ఉంచితే.. అది ఫ్రిజ్‌లో పెట్టినా తాజాగా ఉంటుంది.
2. పిండిని కలిపేటప్పుడు అందులో కొద్దిగా ఉప్పు వేయాలి. ఇలా చేస్తే పిండిలో బ్యాక్టీరియా పెరగదు. ఎక్కువ కాలం పాడవకుండా ఉంటుంది.
3. పిండిని కలిపే సమయంలో కొద్ది నెయ్యి కానీ, నూనె కానీ వేయాలి. అలా చేస్తే పిండి గట్టిగా అవ్వదు. ఫ్రిజ్‌లో పెట్టి తీసిన తరువాత కూడా మెత్తగా ఉంటుంది.
4. మిగిలిన పిండిని ఒక కంటెయినర్‌లో భద్రపరచాలి. గాలి పోని విధంగా ఆ కంటెయినర్ ఉండాలి. దీని వల్ల పిండి గట్టిపడకుండా, మెత్తగా ఉంటుంది.
0 Comments:
Post a Comment