మానవ శరీర నిర్మాణంలో ఎముకలు కీలకపాత్ర పోషిస్తాయి. ఎందుకంటే శారీరక ఎదుగుదల కనిపించాలంటే కచ్చితంగా ఎముకల ఎదుగుదల ఉండాలి. ఎముకల ఎదుగుదలకు విటమిన్-డి చాలా ముఖ్యం.
అయితే ఇప్పటివరకూ విటమిన్-డి లోపం వల్ల ఎముకల సంబంధిత సమస్యలే వస్తాయని అనుకుంటే పొరపాటే. తాజా అధ్యయనాల ప్రకారం విటమిన్-డి లోపిస్తే మానసిక సమస్యలు కూడా వేధిస్తాయని వెల్లడైంది.
విటమిన్-డి లోప వల్ల డిప్రెషన్, ప్రతికూల భావోద్వేగాలను మరింత పెంచుతుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా డిప్రెషన్ సమస్యతో ఏళ్ల తరబడి బాధపడుతున్న వారి రక్తంలో విటమిన్-డి లోపం ఉన్నట్లు తాజా పరిశోధనలో వెల్లడైంది.
అయితే డిప్రెషన్ సమస్యతో బాధపడేవారు విటమిన్-డి సప్లిమెంట్‌ను వాడితే ఆ సమస్య నుంచి కొంతమేర బయటపడ్డారు. దీంతో పరిశోధకులు విటమిన్-డి లోపంతో ఉండేవారు మానసిక సమస్యలతో కూడా బాధపడతారని స్పష్టం చేస్తున్నారు.
ముఖ్యంగా ప్రసవం తర్వాత స్త్రీలు ఈ సమస్యతో ఎక్కువగా బాధపడతారని నిపుణులు చెబుతున్నారు. స్త్రీలు మాత్రమే కాదు వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు కూడా డిప్రెషన్ సమస్యతో బాధపడుతున్నారని పేర్కొంటున్నారు.
విటమిన్-డి లోపం మెదడు పనితీరును రాజీ చేస్తుంది. అలాగే నిరాశ, చిరాకు, ఆందోళన వంటి లక్షణాలను పెంచుతుందని వైద్యులు పేర్కొంటున్నారు.
డిప్రెషన్‌తో బాధపడుతున్న రోగుల్లో విటమిన్ డి లోపం ఉన్నట్లు గుర్తించినప్పటికీ, ఆ లోపం వల్ల అనారోగ్యానికి గురవ్వలేదనే విషయాన్ని గమనించాలని సూచిస్తున్నారు.
అయితే మానసిక సమస్యలకు విటమిన్-డి ప్రధాన కారణం కాకపోయినప్పటికీ, విటమిన్-డి సప్లిమెంట్‌ను వాడడం వల్ల రోగులకు డిప్రెషన్ స్థాయిలు తగ్గుతున్నాయి.
దీంతో ఈ అంశాన్ని రుజువు చేసేందుకు పరిశోధనలు అవసరమని నిపుణులు పేర్కొంటున్నారు. సూర్యరశ్మిలోని ఈవీ కిరణాల వల్ల శరీరానికి అవసరమయ్యే విటమిన్-డి అందుతుందని అందరూ చెబుతూ ఉంటారు.
విటమిన్ డి శరీరంలో ఒక హార్మోన్ లాగా పనిచేస్తుందని, తద్వారా మెదడు, నాడీ వ్యవస్థతో సహా వివిధ అవయవ వ్యవస్థల్లో విభిన్న పాత్రలను కలిగి ఉందని పలువురు వైద్యులు అభిప్రాయం పడుతున్నారు.
విటమిన్-డి శరీరానికి అవసరమయ్యే పనులు చేసే హర్మోన్‌లాగా చూడాలని పలువు వైద్యులు చెబతున్నారు.
జీవక్రియను మెరుగుపర్చడంతో పాటు హార్మోన్ల సమతుల్యతను కూడా విటమిన్-డి ప్రభావితం చేస్తుందని ఇప్పటికే పలు పరిశోధనల్లో వెల్లడైంది.
ముఖ్యంగా ఇంట్లో ఎక్కువ సమయం గడిపే వారు విటమిన్-డి లోపంతో బాధపడతారని పేర్కొంటున్నారు.
విటమిన్-డి లోపం దరి చేరకుండా ఉండాలంటే ప్రతిరోజూ కచ్చితంగా 20 నిమిషాల పాటు ఎండలో ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
అలాగే విటమిన్-డి లోపం నుంచి బయటపడడానికి కొన్ని ఆహారాలను తరచూ తిన్నా మేలు జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
చేపలు, గడ్డు, బలవర్థకమైన పాల ఉత్పత్తులను తరచూ తీసుకున్నా విటమిన్-డి లోపం నుంచి బయటపడవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
అయితే చాలా మంది వైద్యుల సిఫార్సు లేకుండా విటమిన్-డి సప్లిమెంట్స్‌ను తీసుకుంటూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.
0 Comments:
Post a Comment