Viral Video: ఓ చీర.. ఇద్దరు మహిళలు.. సీన్ కట్ చేస్తే.. షాపులోనే పొట్టుపొట్టుగా కొట్టుకున్నారు.. వీడియో చూస్తే..
ఆడాళ్లు.. మీకు జోహార్లు అంటారు.. ఎందుకో తెలుసా..? ఏ విషయంలోనైనా వారికి వారే సాటి.. అందుకే సరిలేరు మీకెవ్వరు అంటుంటారు.. ఏదైనా సాధించాలన్నా..
గొడవ పడాలన్నా.. ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటారు. ఇంకా చీరలో విషయంలో అయితే ఓ మెట్టు పైనే ఉంటారు.. ఎంత ఖర్చు అయిన పర్లేదు కొనాల్సిందే.. కట్టుకోవాల్సిందే.. మగువల విషయంలో చీర కానీ.. ఇంకెదైనా కానీ.. వారు కోరుకున్నది దక్కించుకోకపోతే.. సీన్ వేరేలా ఉంటుంది.. ప్లేస్ ఏదైనా సరే.. ఎవ్వరున్నా సరే రచ్చ.. రచ్చే.. తగ్గేదేలే అంటారు. తాజాగా.. చీరల డిస్కౌంట్ సేల్ కి వెళ్లిన ఇద్దరు మహిళలు.. ఒకే చీరను ఇష్టపడ్డారు.. ఆ చీర నాదంటే.. నాదంటూ.. ఇద్దరు మగువలు అందరిముందే కుస్తీ పట్టారు. ఇద్దరు మహిళల మధ్య చీర విషయంలో తలెత్తిన గొడవ.. కాస్త పొట్టుపొట్టుగా కొట్టుకునేలా చేసింది. ఈ ఘటన
ఈ షాకింగ్ బెంగళూరులోని మల్లేశ్వరంలో జరిగింది. మైసూర్ సిల్క్స్ శారీ సెంటర్ ఇటీవల వార్షిక డిస్కౌంట్ సేల్ నిర్వహించింది. భారీగా డిస్కౌంట్లు ఉండటంతో చీరల కోసం మగువలు షాపునకు పోటెత్తారు. ఈ సమయంలో ఓ చీరను ఇద్దరు మహిళలు ఇష్టపడ్డారు. ఆ చీర నాదంటే.. నాదంటూ ఇద్దరు మహిళలు గొడవపడ్డారు. ఆ తర్వాత సహనం కోల్పోయి దుకాణం లోపలే ఇద్దరు జుట్లు పట్టుకోని మరి కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
వీడియో చూడండి....
వీడియోలో ఇద్దరు మహిళలు చాలా రద్దీగా ఉన్న మైసూర్ సిల్క్స్ స్టోర్‌లో ఒకరినొకరు కొట్టుకుంటున్న దృశ్యాలను చూడవచ్చు. ముష్టియుద్ధానికి దిగడంతో అలెర్ట్ అయిన భద్రతా సిబ్బంది వారిని విడదీసేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ.. వినకుండా ఒకరినొకరు కొట్టుకుంటూనే కనిపంచారు. ఈ సంఘటన జరిగినప్పుడు మైసూర్ సిల్క్స్ దుకాణం లోపల మహిళలు భారీగా ఉన్నారు. వారు కూడా ఈ గొడవను లైట్ తీసుకుని చీరలు కొనుక్కోవడం కొసమెరుపు..
ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తుఫానుగా మారింది.. దీనిపై పలువురు పలురకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
0 Comments:
Post a Comment