Viral Video : ప్రాణాలకు తెగించే సాహసం.. నదిపై బైక్ నడిపిన వ్యక్తి వీడియో వైరల్
Risky video : కొంతమందికి సాహసాలు చేయడం సరదా.. అందుకోసం రకరకాల ఫీట్లు చేస్తూ ప్రాణాలకు తెగిస్తుంటారు. చూసేవాళ్ల గుండెల్లో అవి రైళ్లు పరుగెత్తిస్తుంటాయి.
నదిపై బైక్ (motorcycle ) నడుపుతూ ప్రమాదకరమైన ఫీట్ (feat) చేశాడు ఓ వ్యక్తి.. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నదిలో బోటు మీద కూర్చోవడానికే చాలామంది భయపడతారు. అలాంటిది నదిపై బైక్ నడపడం.. ఎంత డేర్ ఉండాలి ఈ ఫీట్ చేయడానికి .. MotorOctane అనే వ్యక్తి ట్విట్టర్ లో షేర్ చేసిన వీడియో చూస్తే భయం వేస్తుంది. ఒక వ్యక్తి తన బైక్‌తో నదిలోకి దిగి నడపడం ఇప్పుడు వైరల్ గా మారింది. లోతుగా ఉండే నదిపై బైక్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ అంత నైపుణ్యంగా ఎలా నడపగలిగాడా? అని జనం ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ పోస్ట్ షేర్ చేసిన వ్యక్తి అతనిలోని సంకల్ప బలమే ఈ ఫీట్ చేసేందుకు మార్గం చూపించిందనే శీర్షికతో పోస్ట్ పెట్టాడు.
ఇక ఆ వ్యక్తి చేసిన ఫీట్ కి ఇంటర్నెట్ లో అనేకమంది కామెంట్లు పెడుతున్నారు. అతని ధైర్య సాహసాలను మెచ్చుకుంటూ కొందరు.. ఈ ఫీట్ ఎంతవరకూ సేఫ్ అని ప్రశ్నిస్తూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా ఇలాంటి ఫీట్స్ చేసేటపుడు జాగ్రత్తలు అవసరం అని జనం అభిప్రాయపడుతున్నారు.
The perfect example of "Where there is a will there's a way"
— MotorOctane (@MotorOctane) April 6, 2023
Thoughts about this? Very clever or just very risky? pic.twitter.com/FgYfaFlOtt
0 Comments:
Post a Comment