Vastu tips: డబ్బు సమస్యలు వెంటనే పోవాలంటే కర్పూరంతో ఇలా చేసి చూడండి
చాలామంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటారు. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడటం కోసం, సంతోషంగా జీవనం సాగించడం కోసం వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత కష్టపడినా వారి సమస్యలు పరిష్కారం కావు.
అందుకు కారణం వాస్తు దోషాలు. అయితే మనకు తెలియకుండానే చేసే వాస్తు తప్పిదాల కారణంగా అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇంటికి వాస్తు అంటే లోపల అన్ని గదులు, వరండా, టెర్రస్ తో పాటు పరిసరాల వాస్తు కూడా సరిగ్గా ఉంటేనే ఆ కుటుంబానికి మేలు జరుగుతుంది. అయితే ఒక్కొక్కసారి పైన పేర్కొన్న అన్ని విషయాలలోనూ వాస్తును సరిచూసుకోవడం సాధ్యం కాకపోవచ్చు.
అందుకే కొన్ని వాస్తు చిట్కాలను పాటిస్తే ఇటువంటి చిన్న చిన్న వాస్తు దోషాల నుంచి బయటపడవచ్చు అని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు కర్పూరంతో కొన్ని చిట్కాలను చేస్తే మంచి జరుగుతుందని, డబ్బు సమస్యలు తొలగిపోతాయని సూచిస్తున్నారు.
ఆర్థిక సమస్యల నుండి బయటపడాలనుకుంటే లవంగాలు మరియు కర్పూరాన్ని వాస్తు నివారణ కోసం ఉపయోగించాలని సూచిస్తున్నారు ధన నష్టంతో బాధపడుతున్న వారు దాని నుండి బయట పడాలంటే ఒక గిన్నెలో రెండు లవంగాలను ఒక కర్పూరాన్ని తీసుకొని వంటగది వెలుపల దానిని కాల్చాలని, ఈ పరిహారం చేయడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు అని చెబుతున్నారు.
ఇక ఆర్థిక ఇబ్బందులు బాగా చిరాకు పెడుతుంటే, వెంటనే ఆర్థిక సమస్య తొలగిపోవాలనుకునేవారు శనివారం నాడు స్నానం చేసే నీటిలో కర్పూరం కలుపుకొని స్నానం చేస్తే ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయని చెబుతున్నారు.
అంతేకాదు ఎవరికైనా డబ్బులు ఇచ్చి, ఆ డబ్బులు తిరిగి రావడం లేదని బాధపడేవారు,స్నానం చేసి, ధ్యానం చేసిన తర్వాత, పూజ గదిలో ఒక ఎర్ర గులాబీ పువ్వు ను, రెండు లవంగాలను, ఒక కర్పూరాన్ని తీసుకొని అమ్మవారి పాదాల వద్ద సమర్పించాలని సూచిస్తున్నారు.
అలా చేస్తే ఆగిపోయిన డబ్బులు తిరిగి వస్తాయని చెబుతున్నారు. అంతేకాదు ప్రతిరోజు సాయంత్రం కర్పూరం వెలిగించి లక్ష్మీదేవికి హారతి ఇవ్వడం వల్ల, లక్ష్మీదేవిని పూజించటం వల్ల కూడా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని, లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయని సూచిస్తున్నారు. ఇంకా ఇంట్లో ఏదో ఒక మూలలో ప్రతిరోజు నాలుగు కర్పూరం బిళ్ళలను ఉంచితే, తద్వారా కూడా వాస్తు దోషాలు తొలగిపోతాయని చెబుతున్నారు.
0 Comments:
Post a Comment