Turtle Statue : మన ఆచార వ్యవహారాల్లో జంతువులను పూజించడం సహజమే. గోమాత, గరత్మంతుడు, తాబేలు వంటి వాటిని నిత్యం పూజిస్తుంటాం. ఇందులో తాబేలు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకు ప్రతిరూపంగా చెబుతారు.
అందుకే తాబేలుకు అంతటి ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇది 800 ఏళ్లు జీవిస్తుందట. అంటే దాని ఆయుష్షు పరంగా చూస్తే మనది చాలా చిన్న జీవితం.
తాబేలులో విష్ణువు కొలువుంటాడని నమ్ముతూ దాని ప్రతిమను మన ఇళ్ల్లల్లో, కార్యాలయాల్లో పెట్టుకోవడం చూస్తుంటారు. ఇలా చేయడం వల్ల కలిసొస్తుందని విశ్వాసం.
ఈ నేపథ్యంలో తాబేలు బొమ్మను క్రిస్టల్ లో గానీ ఇత్తడి ప్లేట్ లో గానీ పింగాణి పాత్రలో ానీ పెట్టి నీళ్లు పోస్తుంటాం. దీన్ని ఉత్తర దిక్కు గా ఉంచుకుంటాం. ఉత్తర దిశ కుబేరుడి స్థానం అని నమ్ముతాం.
ప్రతి రోజు ఉదయం ప్లేట్ లో ఉన్న నీరు తీసేసి కొత్త నీరు పోయాలి. పోసేటప్పుడు మనసులో కోరికలు కోరుకుంటే తీరుతాయని అంటారు. కుబేరుడి స్థానంలో తాబేలును ఉంచడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
ఇంకా ఒకవేళ అక్వేరియం ఉంటే కూడా దాన్ని ఉత్తర దిశలోనే ఉంచి అందులో తాబేలును ఉంచడం శ్రేయస్కరం. ఉత్తర దిక్కు బుద్ధుడి దిక్కుగా కూడా చెబుతారు.
జ్యోతిష్య శాస్త్రంలో బుధ గ్రహానికి విష్ణుభగవానుడే అధిపతి. అందుకే ఉత్తర దిక్కుకు అంతటి ప్రాశస్త్యం ఉంటుంది.
ఉత్తర దిశగా తాబేలును ఉంచుకుంటే ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నా తొలగిపోతాయి. బుధ గ్రహ దోషాలు కూడా లేకుండా పోతాయి. ఆ ఇంట్లో పిల్లలు మంచి విద్యావంతులుగా తీర్చిదిద్దబడతారు.
మంచి వాక్బుద్ధి కూడా కలుగుతుంది. మంచిగా మాట్లాడే సామర్థ్యం కలిగి ఉంటారని ప్రతీతి. తాబేలు ఉన్న ఇంటిలో వాస్తు దోషాలు దూరమవడమే కాకుండా ఇంట్లోని కుటుంబ సభ్యుల్లో మానసిక ప్రశాంతత సొంతం అవుతుంది. ఇది ఉన్న ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవు.
వ్యాపార స్థలాల్లో కూడా తాబేలు ప్రతిమను ఇటీవల చాలా మంది పెట్టుకుంటున్నారు. వ్యాపారంలో బాగా కలిసి రావాలంటే ఈ పరిహారం చేసుకుంటే సరి.
అందుకే ఏ దుకాణంలో చూసినా తాబేలు ప్రతిమలే దర్శనమిస్తాయి. తాబేలు ప్రతిమకు ఉన్న డిమాండ్ అలాంటిది.
ఈ నేపథ్యంలో తాబేలు ప్రతిమను ప్రతి ఒక్కరు ఇంట్లో కానీ కార్యాలయాల్లో కానీ, వ్యాపార సంస్థల్లో కానీ పెట్టుకుంటే ఎంతో మంచి జరుగుతుందని అందరి విశ్వాసం. దీన్ని అందరు పాటించి మంచి సంపదలు పొందాలని అందరు ఆశిస్తున్నారు.
0 Comments:
Post a Comment