సిఫార్సు లేఖల దుర్వినియోగం - టీటీడీకి ప్రభుత్వం కీలక ఆదేశం..!!
TTD పాలకవర్గం...అధికారులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. వీఐపీ సిఫార్సు లేఖలను దుర్వినియోగం చేసే వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
అటువంటి వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆదేశించింది. తాజాగా ఒక ఎమ్మెల్సీ తన సిఫార్సు లేఖల ద్వారా భక్తుల వద్ద డబ్బులు వసూలు చేసి దర్శనానికి సిఫార్సు చేసిన అంశం వెలుగులోకి వచ్చింది. తిరుమలలో 16 మంది ప్రజా ప్రతినిధులు ఎక్కువగా సిఫార్సు లేఖలను ఇస్తున్నట్లుగా గుర్తించారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవిలో సాధారణంగా రద్దీ పెరుగుతోంది. అదే సమయంలో బ్రేక్ దర్శనాలను పరిమితం చేస్తామని టీటీడీ చెబుతోంది. తాజాగా గోదావరి జిల్లాలకు చెందిన ఒక ఎమ్మెల్సీ తన సిఫార్సు లేఖలతో ఇతర రాష్ట్రాల భక్తులకు లేఖలు ఇచ్చి విజిలెన్స్ సోదాల్లో దొరికిపోయారు. ఎమ్మెల్సీ తరచూ శ్రీవారి దర్శనానికి వస్తుండటంతో అనుమానించిన విజిలెన్స్ అదికారులకు టీటీడీ ఉన్నాధికా రులు సమాచారంఇచ్చారు. ఫోర్జరీ ఆధార్ కార్డులతో భక్తలను తనతో పాటుగా దర్శనానికి తీసుకెళ్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఆరుగురికి దర్శనం చేయించేందుకు లక్షా అయిదు వేల రూపాయాలను తీసుకున్నట్లుగా అధికారులు తేల్చారు.
నెల రోజుల వ్యవధిలో ఆ ఎమ్మెల్సీ 19 సిఫార్సు లేఖలు ఇచ్చినట్లుగా అధికారులు నిర్ధారించారు. ఎవరికీ అనుమానం రాకుండా ఇతర రాష్ట్రాల భక్తులకు లేఖలు ఇస్తూ సొమ్ము చేసుకొనే ప్రయత్నం చేసారు. భక్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్సీ పై టీటీడీ విజిలెన్స్ అధికారులు కేసు నమోదు చేసారు. ఇదే సమయంలో ప్రభుత్వం ఈ ఘటన పైన సీరియస్ అయింది. ఇలాంటి వ్యవహారాల్లో ఎవరినీ ఉపేక్షించ వద్దని ఆదేశించింది. ఎరవైనా సిఫార్సు లేఖలను దుర్వినియోగం చేస్తే కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు 16 మంది ప్రజా ప్రతినిధుల లేఖలు తరచూ దర్శనం కోసం పెద్ద సంఖ్యలో వస్తున్నాయని చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారం పైన టీటీడీ ఆరా తీస్తోంది.
0 Comments:
Post a Comment