చనిపోయిన వారికి చెందిన వస్తువులు వాడితే ఏం జరుగుతుందో తెలుసా?
సాధారణంగా కుటుంబంలో ఎవరైనా మరణిస్తే వారి గుర్తుగా కొన్ని వస్తువులను అలాగే దాచుకుంటారు. మరికొంత మంది వాటిని దహన సంస్కారాల్లోనే నాశనం చేస్తుంటారు.
అయితే చనిపోయిన వ్యక్తికి సంబంధించిన కొన్ని విషయాలు గరుడ పురాణంలో ప్రస్తావించారు. మృతి చెందిన వారికి సంబంధించిన వస్తువులను ఉపయోగించడం వల్ల పలు అనర్థాలు జరుగుతాయని గరుడ పురాణంలో ఉంది. ముఖ్యంగా ఈ మూడు వస్తువులను ఉపయోగించారంటే చెడు జరుగుతుందట. అవెంటో ఇక్కడ తెలుసుకుందాం.
గరుడ పురాణం ప్రకారం.. మరణించిన వ్యక్తికి సంబంధించిన బంగారు ఆభరణాలను ధరించిన వారికి ఆత్మ ఆవహిస్తుందట. అలా జరగకూడదంటే వాటితో కొత్త నగలు చేయించుకోవడం మంచిది. అలాగే మృతి చెందిన వారి దుస్తులు ధరించకూడదు అలా చేస్తే పలు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందట.
కాబట్టి వారి దుస్తువులను పారేయ్యాలి. కుటుంబ సభ్యుల మరణం తర్వాత చనిపోయిన వ్యక్తికి చెందిన చేతి గడియారాన్ని కూడా ఉపయోగించకూడదు. లేదంటే మృతి చెందిన వారు పదే పదే కలలోకి వస్తారు.కాబట్టి గడియారాన్ని పెట్టుకోకుండా ఉండాలి.
0 Comments:
Post a Comment