తెలుగు టూరిస్టులకు గుడ్‌న్యూస్: హైదరాబాద్ నుంచి కాశ్మీర్‌కు ప్రత్యేక రైలు
హైదరాబాద్: రైల్వే శాఖ తాజా నిర్ణయంతో తెలుగు ప్రజలకు కాశ్మీర్ అందాలను చూడటం మరింత సులభం కానుంది. హైదరాబాద్ మీదుగా కాశ్మీర్ లోయకు మే 11న ప్రత్యేక సేవలు ప్రారంభిస్తున్నట్లు సౌత్ స్టార్ రైలు ప్రతినిధులు వెల్లడించారు.
భారతీయ రైల్వే ప్రారంభించిన భారత్ గౌరవ్ పథకంలో భాగంగా 'సౌత్ స్టార్' నూతన రైల్వే సేవలు అందిస్తోంది.
ఈ సందర్భంగా సౌత్ స్టార్ రైల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ విఘ్నేశ్ ఆదివారం సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. వేసవి విడిది నేపథ్యంలో థీమ్ టూరిస్ట్ ప్యాకేజీలో భాగంగా కాశ్మీర్‌కు ప్రత్యేక రైల్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ రైలు కోయంబత్తూర్ నుంచి ప్రారంభమై హైదరాబాద్, వరంగల్, ధర్మపురి, విజయవాడ, ఈరోడ్, సేలం, ఎలహంక, పెరంబదూర్ మీదుగా ప్రయాణిస్తుందని వెల్లడించారు.
భారత పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ టూర్ ఆపరేటర్లను పర్యవేక్షిస్తుందని తెలిపారు. ప్యాకేజీ వ్యవధి 12 రోజులని తెలిపారు. ఇందులో ప్రత్యేక సదుపాయాలతోపాటు ప్రయాణ బీమా, సైట్ సీయింగ్, భోజన వసతి అందిస్తున్నామని చెప్పారు రీజినల్ మేనేజర్ సంతోష్. బుకింగ్ తదితర సమాచారం కోసం 7876101010 నెంబర్ లేదా https://www.irctctourism.com/tourpackageBooking?packageCode=SHA11 సంప్రదించవచ్చని తెలిపారు.
జమ్మూ కాశ్మీర్‌లోని లోయలు, కొండలు, ఇతర పర్యాటక ప్రాంతాలు చూడవచ్చు. కాశ్మీర్ టూర్ ప్యాకేజీ ప్రత్యేకత ఏంటంటే పర్యాటకులకు హౌజ్ బోట్‌లో వసతి లభిస్తుంది. ఒక్క జూలైలోనే 10 సార్లు ఈ టూర్ ఆపరేట్ చేస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. జూలై 2, 6, 10, 15, 18, 22, 24, 26, 29, 30 తేదీల్లో ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేయొచ్చు.
0 Comments:
Post a Comment