Tooth Paste: టూత్‌పేస్ట్‌ను దంతాలను శుభ్రం చేసుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటాం. టూత్‌పేస్ట్ వాడటం వల్ల దంతాలు తెల్లగా మెరిసిపోతాయి. నోట్లోని క్రిములు చనిపోయి నోరు ప్రెష్‌గా ఉంటుంది
అలాగే టూత్‌పేస్ట్ వల్ల చిగుళ్లు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. కానీ టూత్‌పేస్ట్ వల్ల ఇంకా చాలా పనులు చేసుకోవచ్చు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
బంగారు ఆభరణాలు మరింత మెరవడానికి కూడా టూత్‌పేస్ట్‌ను ఉపయోగించుకోవచ్చు. బంగారం మరింత ప్రకాశంతంగా కనిపిస్తుంది. దగదగా మెరుస్తుంది.
ఇందుకోసం టూత్‌పేస్ట్‌లో నీటిని కలిపి ద్రావణాన్ని తయారుచేయాల్సి ఉంటుంది. ఈ ద్రవణాన్ని బంగారు నగలకు అప్లై చేస్తే దగదగా మెరుస్తాయి.
ద్రవణాన్ని మృదువైన బ్రష్ లేదా స్ర్కబ్‌తో రుద్దంతో ద్వారా నగలను శుభ్రం చేయాల్సి ఉంటుంది. మీ ఆభరణాలు సరికొత్తగా కనిపించేలా చేస్తాయి.
ఇక ట్రాలీ బ్యాగ్‌పై ఉన్న మరకలను శుభ్రం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అర టీస్పూన్ టూత్‌పేస్ట్‌లో 1 టీస్పీన్ బేకింగ్ సోడడా మిక్స్ చేసి ట్రాలీ బ్యాగ్‌పై అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత శుభ్రమైన గుడ్డతో తడిపి బ్యాగ్‌ను శుభ్రం చేయాల్సి ఉంది.
దీని వల్ల మీ ట్రాలీ బ్యాగ్ కొత్తగా, ఎలాంటి మచ్చలు లేకుండా శుభ్రంగా ఉంటుంది. అలాగే టైల్స్ శుభ్రం చేయడానికి కూడా టూత్ పేస్ట్‌ను ఉపయోగించుకోవచ్చు.
ఇందుకోసం టూత్‌పేస్ట్‌ని గోరువెచ్చని నీటిలో కలవపడం. అప్పుడు ఆ ద్రవణాన్ని తీసుకుని టైల్స్ కి అప్లై చేసి మెత్తని స్ర్కబ్ తో రుద్దండి. దీని వల్ల ఇంట్లో అమర్చిన టైల్స్ వెంటనే మెరుస్తాయి.
ఇక గొడవలకు ఉన్న రంధ్రాలను పూడ్చటానికి కూడా టూత్‌పేస్ట్‌ని ఉపయోగించుకోవచ్చు. ఇక ట్యాప్‌ని శుభ్రం చేయడానికి, అద్దాన్ని మెరిసేలా చేయడానికి కూడా టూత్ పేస్ట్‌ని వాడుకోవచ్చు.
0 Comments:
Post a Comment