Tips to improve car mileage : ఏ గేర్‌లో నడిపితే కారు మైలేజ్ పెరుగుతుంది?
Tips to improve mileage of a car : ఇంధన ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఫలితంగా ప్రజల జేబుల నుంచి ఒక్కోసారి ఎక్కువ ఖర్చు అవుతుంటుంది. అందుకే చాలా మంది..
మంచి మైలేజ్ ఇచ్చే వాహనాలను కొనాలని భావిస్తుంటారు. అయితే.. కొన్ని టిప్స్ పాటించి మైలేజ్‌ని పెంచుకోవచ్చు. ముఖ్యంగా మేన్యువల్ గేర్‌బాక్స్ ఉండే వాహనాల్లో.. గేర్‌ను షిఫ్ట్ చేసే ప్రక్రియతోనూ మైలేజ్ ప్రభావితమవుతుంది. ఈ నేపథ్యంలో.. అసలు ఏ గేర్‌లో కారు నడిపితే మంచి మైలేజ్ వస్తుంది? అన్న విషయం ఇక్కడ తెలుసుకుందాము..
మీ కారు మైలేజ్‌ను పెంచుకోండి ఇలా..
How to shift gears in car : పెద్ద నెంబర్ గేర్లు ఉండి, మాటిమాటికి వాటిని షిఫ్ట్ చేయకుండా ఉంటే.. ఫ్యూయెల్ ఎఫీషియన్సీ పెరుగుతుందని అందరికి తెలిసిన విషయమే. అయితే ఇది హైవేలో తప్పిస్తే, నగరాల్లో పాటించడం చాలా కష్టమవుతుంది. ట్రాఫిక్ నేపథ్యంలో ఎప్పటికప్పుడు గేర్లు మారుస్తూనే ఉండాలి. ట్రాఫిక్ వల్ల పెద్ద నెంబర్ గేర్లు కూడా వేయలేము. కాదని హై గేర్‌లో నడిపితే.. బండి తొందరంగా పాడైపోతుంది.
నగరాల్లో, ముఖ్యంగా ట్రాఫిక్‌లో 1,2 నెంబర్ గేర్లనే ఉపయోగించాల్సి వస్తుంది. 3వ గేర్ కూడా డ్రైవర్లు వాడుతుంటారు. 4వ గేర్ వచ్చేసరికి, మళ్లీ ట్రాఫిక్ మొదలైపోతుంది! అయితే ఇక్కడే ఒక చిన్న టిప్ ఉపయోగపడుతుంది. గేర్ మారుస్తున్నప్పుడు ఇంజిన్ రిథమ్‌ను పరిశీలించాలి. ఎక్కడ ఇంజిన్ స్మూత్‌గా, ఒత్తిడి లేకుండా ముందుకెళుతుందో చూడాలి. గేర్ మారుస్తున్నప్పుడు.. ఎలాంటి జెర్క్‌లు రాకుండా, వాహనం స్మూత్‌గా వెళుతుందో డ్రైవర్ గమనించాలి. అవకాశం ఉన్నప్పుడల్లా ఆ గేర్‌లో బండిని నడిపిస్తే.. మైలేజ్ కాస్త పెరిగే అవకాశం ఉంటుంది.
How to improve car mileage : కారును జీరో స్పీడ్ నుంచి ముందుకు తీసేందుకు మొదటి గేర్‌ను ఉపయోగించాలి. అయితే కొందరు రెండో గేర్ నుంచి పని మొదలుపెడతారు! ఇది సరైన పద్ధతి కాదు. ఇంజిన్‌పై అధిక ఒత్తిడి పడుతుంది. మొదటి గేర్‌లో టార్క్ ఎక్కువగా ఉండటంతో.. బండి సులభంగా ముందుకు కదులుతుంది. అద విధంగా 2వ గేర్..ట్రాఫిక్‌లో ఉపయోగించవచ్చు. నిదానంగా బండిని ముందుకు తీసేందుకు ఇది ఉపయోగపడుతుంది. కారు స్పీడ్ 40-45కేఎంపీహెచ్ అందుకున్నప్పుడు.. 3వ గేర్ వేసుకోవచ్చు. అయితే.. ఇవన్నీ ఒక్కో కారులో ఒక్కో విధంగా ఉంటుంది. మీరు మీ కారు రిథమ్‌ను గుర్తించి, అందుకు తగ్గట్టుగా గేర్‌ను షిఫ్ట్ చేస్తూ ఉంటే.. మైలేజ్ పెరుగుతుంది!
0 Comments:
Post a Comment