Thyroid Control Tips: థైరాయిడ్ సమస్యకు ఇదే సమాధానం, ఈ విత్తనాలు డైట్‌లో ఉంటే చాలు.
Thyroid Control Tips: థైరాయిడ్ అనేది వయస్సుతో సంబంధం లేకుండా అందరికీ ఎదురౌతోంది. థైరాయిడ్ సాధారణ సమస్యే అయినా దీని కారణంగా ఇతర సమస్యలు చాలా ఏర్పడుతుంటాయి.
థైరాయిడ్ సమస్య మూలంగా డయాబెటిస్, రక్తపోటు వంటి ఇతర ప్రమాదకర వ్యాధులు చుట్టుముట్టే ప్రమాదముంది.
డయాబటిస్, కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు వంటి లైఫ్‌స్టైల్ వ్యాధుల్లానే థైరాయిడ్ ఒకటి. థైరాయిడ్ నియంత్రణ పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. ముఖ్యంగా ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. నట్స్, సీడ్స్ వంటివి తరచూ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనకరం. వీటిని డైట్‌లో చేర్చడం ద్వారా థైరాయిడ్ సమస్యను నియంత్రించవచ్చు. దైరాయిడ్ వ్యాధిగ్రస్థులు ఎలాంటి డైట్ తీసుకోవాలో తెలుసుకుందాం.
సన్‌ఫ్లవర్ విత్తనాలు
థైరాయిడ్ సమస్య ఉంటే సన్‌ఫ్లవర్ విత్తనాలు చాలా మంచిది. ఎందుకంటే ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. వీటిలో ఉండే సెలేనియం థైరాయిడ్ నియంత్రణకు అద్భుతంగా దోహదపడుతుంది. అందుకే థైరాయిడ్ రోగులు డైట్‌లో సన్‌ఫ్లవర్ విత్తనాల్ని చేర్చుకోవాలి.
ఫ్లక్స్ విత్తనాలు
ఫ్లక్స్ సీడ్స్ విత్తనాల్లో పోషక పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. ఎందుకంటే ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఫ్లక్స్ సీడ్స్‌లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా ఇమ్యూనిటీ పటిష్టమౌతుంది. థైరాయిడ్ సమస్య దూరమౌతుంది. ఫ్లక్స్ సీడ్స్ విత్తనాలను రోజూ డైట్‌లో చేర్చుకోవాలి.
చియా సీడ్స్
చియా సీడ్స్‌ను సూపర్ ఫుడ్‌గా పిలుస్తారు. ఇందులో కావల్సిన అన్ని పోషక పదార్దాలుంటాయి. థైరాయిడ్ నియంత్రణలో దోహదమౌతుంది. థైరాయిడ్ వ్యాధిగ్రస్థులు చియా సీడ్స్ సేవిస్తే మంచి ఫలితాలుంటాయి. చియా సీడ్స్ స్వెల్లింగ్ నియంత్రణలో అద్భుతంగా పనిచేస్తాయి. పాలలో నానబెట్టి తీసుకుంటే మెరుగైన ఫలితాలుంటాయి.
0 Comments:
Post a Comment