Thirst Symptoms: మనిషి జీవితంలో నీళ్లు కీలకపాత్ర పోషిస్తాయి. రోజూ తగిన మోతాదులో నీళ్లు తాగకపోతే చాలా అనారోగ్య సమస్యలు ఎదురౌతాయి. కానీ అదే నీటి అవసరం అధికమైతే శరీరంలో అంతర్గతంగా ఏదో సమస్య ఉన్నట్టే అర్ధం చేసుకోవాలి.
ఆలస్యం చేయకుండా తక్షణం వైద్యుడిని సంప్రదించాలి.
నీరే జీవితమన్నారు పెద్దలు. రోజూ తగినంత నీరు తప్పకుండా తాగాల్సిందే అంటారు వైద్యులు. ఎందుకంటే మనిషి శరీరంలో మూడు వంతులు నీళ్లే ఉన్నాయి. శరీరానికి కావల్సిన నీరు అందకపోతే అన్నీ సమస్యలే.
వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. ముఖ్యంగా ప్రమాదకరమైన డీ హైడ్రేషన్ సమస్య వెంటాడుతుంది. శరీరంలో నీటి పరిమాణం తగ్గినప్పుడు నీళ్లు తాగాలనే సంకేతాల్ని మెదడు ఇస్తుంది.
దీనినే దాహం అంటారు. దాహం వేయడం అనేది ఓ సాధారణ ప్రక్రియ. కానీ కొంతమందికి అవసరానికి మించి దాహం వేస్తుంటుంది. ఇది అసాధారణం.
ఇలా జరిగిందంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం కూడదు. ఏదైనా సీరియస్ వ్యాధికి సంకేతం కావచ్చు. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
దాహం అతిగా ఉందంటే కారణమేంటి
చాలా సందర్భాల్లో మన మానసిక పరిస్థితి సరిగ్గా ఉండదు. ఆందోళనగా, ఏదో తెలియని వ్యాకులత పీడిస్తుంటాయి. ఈ పరిస్థితుల్లో నోరెండిపోతుంటుంది. ఎక్కువ నీళ్లు తాగాల్సి వస్తుంది. ఎంత తాగినా దాహం తీరదు. పదే పదే నోరెండిపోతుంటుంది. ఈ పరిస్థితి మానసిక సమస్యకు సంకేతం కావచ్చు.
వేసవి కాలంలో సాధారణంగా చెమట ఎక్కువగా పడుతుంటుంది. కానీ శీతాకాలం లేదా వర్షకాలంలో కూడా ఇలా ఉందంటే శరీరంలో ఏదో సమస్య ఉందని అర్ధం చేసుకోవచ్చు. ఫలితంగా ఎక్కువ దాహం వేస్తుంది.
డయాబెటిస్
ఇటీవలి కాలంలో డయాబెటిస్ ప్రధాన సమస్యగా మారింది. అన్ని వయస్సులవారిని టార్గెట్ చేస్తుండటం ఆందోళన కల్గిస్తోంది. కొన్ని కేసుల్లో జెనెటిక్ కారణం కావచ్చు. కానీ సాధారణంగా చెడు జీవనశైలి, అన్‌హెల్తీ ఫుడ్స్ డయాబెటిస్‌కు కారణమౌతాయి.
మధుమేహం ఉన్నప్పుడు రక్తంలో చక్కెర శాతం పెరిగిపోతుంది. కిడ్నీ సులభంగా ఫిల్టర్ చేయజాలదు. దాంతో శరీరంలో నీటి కొరత ఏర్పడి తరచూ దాహం వేస్తుంటుంది. ఈ పరిస్థితుల్లో వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది.
అజీర్తి
చాలా సందర్భాల్లో పెళ్లిళ్లు, పార్టీలు లేదా ఇంట్లో మసాలా పదార్ధాలు తిన్నప్పుడు జీర్ణక్రియలో ఇబ్బంది ఏర్పడుతుంటుంది.
మసాలా తిండి పదార్ధాలు తిన్నప్పుడు జీర్ణించేందుకు శరీరంలో ఎక్కువ నీళ్ల అవసరం ఉంటుంది. సాధారణం కంటే ఎక్కువ నీళ్లు తాగుతుంటాము. అంటే శరీరంలో అజీర్తి సమస్య ఉన్నప్పుడు తరచూ దాహం వేస్తుంటుంది.
0 Comments:
Post a Comment