సుబ్రహ్మణ్యేశ్వరుడు కారణ జన్ముడు.
తారకాసుర సంహారం కోసం జన్మించినవాడు. దేవగణానికి సర్వసేనాధిపతిగా పురాణాలు చెబుతున్న ఆ స్వామి సర్వశక్తిమంతుడు. ఆది దంపతులైన శివపార్వతులకు ముద్దుల తనయుడు.
దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన దక్షిణ కన్నడ ఆలయ వార్షికాదాయం 100 కోట్లు దాటింది. అవును దక్షిణ ప్రముఖ నాగక్షేత్రం కుక్కే సుబ్రహ్మణ్యం ఈ ఘనత సాధించింది
మీరు ఎప్పుడైనా కుక్కే సుబ్రమణ్య దేవాలయానికి వెళ్ళితే అక్కడి అది సుబ్రమణ్య దేవాలయంలో భక్తులకు వల్మిక మృత్తికా అంటే పుట్ట మన్ను ప్రసాదరూపంలో అందిస్తారు.
మృత్తికా ప్రసాదాన్ని ఎవరు ధరిస్తారో వారికీ నాగుల భయం ఉండదు. నాగ దేవతల అనుగ్రహం ఉంటుంది.
ఆడ పిల్లలు ఎవరైతే ఎంత మంది పెళ్లి కొడుకులు వచ్చిన వివాహానికి ఒప్పుకోరో అటువంటి ఆడ పిల్లలు లేదా అబ్బాయులు పెళ్లి చూపులకు వెళ్ళే సమయంలో శ్రీ సుబ్రమన్యస్వామిని ధ్యానించి ఒక చిటిక మృత్తికాను మరో చిటిక పసుపును స్తానంచేసి సమయంలో వేడినీరు కాచే పాత్రలో వేసి తరువాత స్తానం చేయాలి.
తరువాత శుబ్రమైన వస్త్రాన్ని కట్టుకొని దేవునికి నేతి దీపాన్ని వెలిగించి ప్రాద్దన చేస్తే వివాహం త్వరగా అవుతుంది.
ఇక ఈ గుడి ఆదాయానికి వస్తే 2022-23 సంవత్సరంలో, దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ నాగక్షేత్ర కుక్కే సుబ్రహ్మణ్యం 123 కోట్ల 64 లక్షల రూపాయల ఆదాయాన్ని ఆర్జించింది. ఈ విధంగా క్షేత్ర చరిత్రలో తొలిసారిగా వార్షిక ఆదాయం 100 కోట్లు దాటింది.
గతేడాది నుంచి 51 కోట్ల అదనపు ఆదాయం సమకూరింది. కానీ ఈ ఏడాది ఆలయ ఆదాయం 100 కోట్లు దాటింది. కుక్కే దేవాలయం నాగారాధనకు చాలా ప్రసిద్ధి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఈ ప్రాంతానికి వచ్చి నాగదేవుని కృపకు పాత్రులవుతారు.
0 Comments:
Post a Comment