తలయేరు గుండు
ఈ ఫోటోలో కనిపిస్తున్న పెద్ద బండను తలయేరు గుండు అంటారు అలిపిరి నుంచి తిరుమల వెళ్లే కాలినడక మార్గంలో ప్రథమ గోపురం దాటిన తరువాత ఈ తలయేరు గుండును చూడవచ్చు. తలయేరు అంటే తలనొప్పి అని అర్థం. ఏడుకొండలు ఎంతో శ్రమతో ఎక్కి, దిగే భక్తులకు తలనొప్పి, ఒంటినొప్పులు మోకాళ్ల నొప్పులు వంటివి రాకుండా ఉండడానికి తమ తలను మోకాళ్ళను ఆ గుండుకు తాకించి చిన్నగా రుద్దుతారు అలా చేస్తే ఒంటినొప్పులు రావని ఉన్న నొప్పులు పోతాయని భక్తుల నమ్మకం. అలా అనేక శతాబ్దాలుగా భక్తులు తమ తల, మోకాళ్లు ఆ గుండుకు ఆనించి ఆనించి ఏర్పడిన గుంతలను మనం నేటికీ చూడవచ్చు.
దీనికే మరొక కథ కూడా ఉంది..
మాదిగ రామయ్య అనే శ్రీవారి భక్తుడు స్వామివారికి ముత్యాలు గవ్వలు వంటివి జోడించి ఎంతో అందంగా చెప్పులు కుట్టించేవాడు. ఏదో కారణం వలన ఆ చెప్పులు కుట్టే పనికి ఆటంకం ఏర్పడింది. ఆ బాధతో ఆ వృత్తి వారు అక్కడున్న రాతిబండకు తలలు బాదుకోవడం వలన ఆ బండకి గుంతలు ఏర్పడి అదే తలయేరు బండ అయ్యింది.ఈసారి మీరు అలిపిరి మార్గంలో కాలినడకన తిరుమల వెళ్ళేటట్లయితే ప్రథమ గోపురం దాటిన తర్వాత వచ్చే తలయేరు గుండు కి మీ తల, మోకాలు ఆనించి స్వామి వారిని ప్రార్థించి మీ నొప్పులు తగ్గాలని, కొత్త నొప్పులు రావద్దని ప్రార్థించండి. అలానే గుండు పైన ఉన్న ఆంజనేయస్వామికి నమస్కరించండి.
మూలం: తిరుపతి కథలు - ఆచార్య పేట శ్రీనివాసులు రెడ్డి
0 Comments:
Post a Comment