Summer Health Tips: వేసవిలో జలుబు వేధిస్తోందా? ఈ సహజమైన పద్ధతులు పాటించారంటే సూపర్ రిలీఫ్
వేసవిలో వచ్చే వాతావరణ మార్పుల వల్ల వైరస్ లు చుట్టుముట్టడంతో అనారోగ్యానికి గురవుతారు. ఈ టైమ్ లో అలర్జీలు, ఇన్ఫెక్షన్లు చురుకుగా ఉండటం వల్ల ఎక్కువ మంది వీటిని బారిన పడిపోతారు.
చలికాలంలోనే జలుబు చేస్తుందని అందరూ అనుకుంటారు. కానీ వేసవిలోని వెచ్చని గాలుల కారణంగా వేడి జలుబు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వేడిగా ఉన్నప్పుడు రైనోవైరస్ జలుబుకి కారణమవుతుంది. ఇది సులభంగా వ్యాప్తి చెందుతుంది.
వేసవిలో అలర్జీ
జలుబు లేదా వేసవి అలర్జీలు ఉన్నాయా అని చెప్పడం కాస్త కష్టమే అయినప్పటికీ ఈ రెండింటికీ మధ్య తేడాలు ఉన్నాయి. తుమ్ములు, ముక్కు కారటం, దురద, గొంతు నొప్పి వంటి లక్షణాలు ఈ రెండు వ్యాధుల్లో సాధారణంగా కనిపిస్తాయి. అయితే సాధారణంగా చేసే జలుబు వల్ల దగ్గు చెమటలు, జ్వరం వంటి ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయి. అంతే కాదు జలుబు ఒకటి లేదా రెండు వారాల్లో తగ్గిపోతుంది. కానీ అలర్జీలు దాని కంటే ఎక్కువ కాలం పాటు ఉండి ఇబ్బంది పెట్టేస్తాయి. వేసవిలో చేసే జలుబు నుంచి బయట పడేందుకు కొన్ని సహజమైన మార్గాలు ఉన్నాయి. వాటిని అనుసరిస్తే చాలు డాక్టర్ దగ్గరకు వెళ్ళకుండానే జలుబును తగ్గించుకోవచ్చు.
విశ్రాంతి
అనారోగ్యంగా ఉన్నప్పుడు విశ్రాంతి, నిద్ర ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. రోగనిరోధక వ్యవస్థను మరింత బలహీనపరిచే అధిక శ్రమతో కూడిన శారీరక శ్రమలను నివారించాలని వైద్యులు సూచిస్తున్నారు.
బాగా తినాలి
సాధారణంగా జలుబుగా అనిపిస్తే ఆహారం తీసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏది తినాలని తాగాలని అనిపించదు. కానీ మీరు త్వరగా రోగం నుంచి బయట పడాలంటే మాత్రం బాగా తినాలి. ద్రవ పదార్థాలు పుష్కలంగా తీసుకోవాలి. ఆల్కహాల్, కాఫీ, కార్బొనేటెడ్ పానీయాలను నివారించడం ఉత్తమం. జలుబు దగ్గు నుంచి ఉపశమనం పొందేందుకు అల్లం, సొంపు గింజలు, ఫుదీనా వంటి సహజ పదార్థాలు వేసి తయారు చేసుకునే హెర్బల్ టీ తాగడం మంచిది. విటమిన్లు, మినరల్స్ తీసుకోవడం ముఖ్యం. ఐరన్, జింక ఎక్కువగా ఉండే ఫుడ్ తినాలి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
ఈ మూలికలు తీసుకోండి
ఆరోగ్య నిపుణులు అభిప్రాయం ప్రకారం ఔషధ గుణాలు కలిగిన కొన్ని మూలికలు వైరస్ లను చంపి జలుబుతో పోరాడేలా సహాయపడతాయి. అందుకే లికోరైస్ రూట్స్, ఎల్డర్ బెర్రీ, వెల్లుల్లి వంటి ప్రసిద్ధ మూలికలు తీసుకోవడం మంచిది. ఇవి ఆరోగ్యాని ఇస్తాయి. చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.
హ్యూమిడిఫైయర్లు
ముక్కు కారటం, గొంతు నొప్పి, దగ్గు వంటి జలుబు లక్షణాల నుండి ఉపశమనం పొందేందుకు హ్యూమిడిఫైయర్లు సహాయపడతాయి.
సుగంధ ద్రవ్యాలు
జలుబు అద్భుతమైన ఔషధం పసుపు. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగిన పసుపు జలుబుని త్వరగా నయం చేస్తుంది. ఇందులోని కర్కుమిన్ యాంటీ సెప్టిక్ గా పని చేస్తుంది. శరీరాన్ని శక్తివంతం చేసి అనారోగ్యాన్ని అధిగమించడంలో సహాయపడుతుంది.
శుభ్రంగా ఉండాలి
జలుబు అంటువ్యాధి. అందుకే జలుబు వచ్చిన వారికి దూరంగా ఉండాలి. క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవాలి. బయట నుంచి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు చేతులు శానిటైజ్ చేసుకోవడం చాలా ముఖ్యం. అంతే కాదు చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. వేడి, తేమ వాతావరణంలో బ్యాక్టీరియా వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే పరిసరాల పరిశుభ్రత అవసరం.
0 Comments:
Post a Comment