నక్షత్రానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు.. ఇది కదా విశ్వమంత నివాళి అంటే!
భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఇకపై మనకు ఆకాశంలో మెరుస్తూ కనిపిస్తారు. బడుగు జీవుల కోసం అహరహం కృషి చేసిన ఆయన 132వ జయంతి సందర్భంగా..
ఆయన పేరును ఓ నక్షత్రానికి పెట్టారు. అంబేద్కర్ లాంటి వారికి మనం ఏం చేసినా తక్కువే అవుతుంది. ఆ మహనీయుడికి ఈ భారతావని మనం ఎప్పటికీ రుణపడి ఉంటుంది. కనీసం ఆయన కోసం ఏదైనా చెయ్యాలనే తపన మనలో ఉంటుంది. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మన తెలంగాణలో ఏకంగా భారీ కాంస్య విగ్రహాన్ని ప్రారంభిస్తున్నారు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీ నగర్‌లో అంబేద్కర్ అనుచరులు.. ఓ నక్షత్రానికి ఆయన పేరును పెట్టడం ద్వారా తమదైన శైలిలో నివాళి అర్పించారు.
1956 డిసెంబర్ 6న అంబేద్కర్ కన్నుమూశారు. ఆ అంత్యక్రియలకు లక్షల మంది తరలివచ్చారు. వారంతా... ఆ సూర్యచంద్రులు ఉన్నంతకాలం.. అంబేద్కర్ పేరు కూడా చిరస్థాయిగా నిలిచివుంటుందని అన్నారు. 67 ఏళ్ల తర్వాత ఆ నినాదం వాస్తవ రూపు దాల్చింది. ఛత్రపతి సంభాజీ నగర్‌లోని భీస్ సైనిక్ విభాగం.. ఓ నక్షత్రాన్ని కొని.. దానికి అంబేద్కర్ పేరు పెడుతూ.. రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేసింది.
భీమ్ సైనిక్.. నక్షత్ర రిజిస్ట్రేషన్ ఎలా చేసింది?
సంభాజీ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లోని స్టాండింగ్ కమిటీ మాజీ ఛైర్మన్ రాజు షిండే... ఆ రోదసీ నక్షత్రాన్ని కొన్నారు. తర్వాత దానికి బాబాసాహెబ్ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు. ఫిబ్రవరి 9, 2023న అమెరికాలోని ఇంటర్నేషనల్ స్టార్ అండ్ స్పేస్ రిజిస్ట్రీకి అప్లికేషన్ పెట్టుకున్నారు. అంబేద్కర్‌కి సంబంధించిన రుజువుల డాక్యుమెంట్స్‌ని సమర్పించారు. వాటిని పరిశీలించిన ఆ సంస్థ.. ఆ పేరును నక్షత్రానికి పెడుతూ.. సర్టిఫికెట్‌ని ఆన్‌లైన్‌లో రాజు షిండేకి పంపింది. ఈ కారణంగా... ఏప్రిల్ 14, 2023 నుంచి ఈ నక్షత్రం.. ఆండ్రాయిడ్ , యాపిల్ యూజర్ల మొబైల్ , ల్యాప్‌టాప్స్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ఈ నక్షత్రాన్ని చూడాలంటే ఏం చెయ్యాలి?
ఏప్రిల్ 14, 2023 నుంచి బాబా సాహెబ్ అభిమానులు.. తమ మొబైల్ , ల్యాప్‌టాప్‌లో ఆ నక్షత్రాన్ని చూడవచ్చు. ఇందుకోసం ముందుగా.. మొబైల్ ప్లే స్టోర్ నుంచి Space Registry లేదా Star Naming applicationని డౌన్ లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్‌పై రిజిస్ట్రీ నంబర్ CX26529US ఎంటర్ చెయ్యాలి. "ఆండ్రాయిడ్, IOS యూజర్ల కోసం ప్రత్యేక యాప్ ఉంది. ఈ నక్షత్రాన్ని innovative user Star Finder 3D smartphone app ద్వారా చూడొచ్చు" అని రాజు షిండే తెలిపారు.
"డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ కోసం ఏటా ఏదో ఒకటి చేస్తున్నాం. ఈ సంవత్సరం ఇంకా ప్రత్యేకంగా ఏదైనా చెయ్యాలి అనుకున్నాం. మా కలను నిజం చేసుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నించాం" అని రాజు షిండే తెలిపారు. విశ్వంలో ఓ నక్షత్రం పేరు బాబాసాహెబ్ అవ్వడం అనేది మాకు ఎంతో ఆనందం కలిగించే అంశం అని రాజు షిండే అత సంతోషాన్ని తెలిపారు.
0 Comments:
Post a Comment