Solid-Fuel Technology:సాలిడ్ ఫ్యుయల్‌తో ఏం జరుగుతుంది.. ఎలా దాన్ని వాడుతారు.. ఆ టెక్నాలజీ ఏంటో తెలుసుకుందాం. ఘన ఇంధనాన్ని క్షిపణుల్లో వాడడం వల్ల చాలా లాభాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఉత్తర కొరియా ఇప్పుడు ఆ టెక్నాలజీని డెవలప్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది.
సియోల్: సాలిడ్ ఫ్యుయల్ టెక్నాలజీ(Solid-Fuel Technology)తో రూపొందించిన ఖండాంతర క్షిపణిని ఉత్తర కొరియా పరీక్షించిన విషయం తెలిసిందే.
సుదీర్ఘ దూరం ప్రయాణించే క్షిపణుల్లో ఈ టెక్నాలజీని వాడుతున్నారు. ఇంతకీ సాలిడ్ ఫ్యుయల్ టెక్నాలజీ ఏంటో తెలుసుకుందాం. ఆ మిస్సైళ్లను నార్త్ కొరియా ఎలా డెవలప్ చేస్తుందో కూడా తెలుసుకుందాం.
ఏంటీ టెక్నాలజీ..
సాలిడ్ ఫ్యూయల్.. ఇంధనం, ఆక్సిడైజర్ సమ్మేళనం. ఘన ఇంధనంతో క్షిపణిని ప్రయోగిస్తారు. లోహాల ధాతువులతో ఘన ఇంధనాన్ని తయారు చేస్తారు. దీంట్లో అల్యూమినియం ఇంధనంగా వ్యవహరిస్తుంది. అమోనియం పర్చులోరేట్‌ని కూడా వాడుతారు. పర్చులోరిక్ ఉప్పు, అమోనియా కలిసి ..సాధారణ ఆక్సిడైజర్‌గా మారుతాయి.
ఇంధనాన్ని, ఆక్సిడైజర్‌ను ఓ హార్డ్ రబ్బర్ వస్తువులో మెటల్ ప్యాక్ చేస్తారు. ఘన ఇంధనం అంటుకున్నప్పుడు.. అమోనియా పర్చులోరేట్‌లో ఉన్న ఆక్సిజన్‌తో కలుస్తుంది. ఆ దశలో అత్యంత భారీ స్థాయిలో ఎనర్జీ రిలీజు అవుతుంది. దాదాపు 2760 డిగ్రీల సెల్సియస్ శక్తి విడుదల అవుతుంది. ఆ ఎనర్జీతోనే లాంచ్ ప్యాడ్ నుంచి మిస్సైల్ ఎగురుతుంది.
ఎవరి వద్ద ఆ టెక్నాలజీ ఉంది..
శతాబ్ధాల క్రితమే చైనాలో ఘన ఇంధనానికి చెందిన బాణాసంచాను డెవలప్ చేశారు. అయితే 20వ శతాబ్ధంలో దానికి చెందిన ప్రోగ్రెస్ చోటుచేసుకుంది. 1970 దశకంలోనే రష్యా తన తొలి సాలిడ్ ఫ్యూయల్ ఐసీబీఎంను పరీక్షించింది. ఆ తర్వాత ఫ్రాన్స్ మీడియం రేంజ్ ఎస్3 మిస్సైల్‌ను టెస్ట్ చేసింది. 1990 దశకం నుంచి ఐసీబీఎంలను చైనా టెస్టింగ్ చేయడం ప్రారంభించింది.
ఘన వర్సెస్ ద్రవ
లిక్విడ్ ఉత్ప్రేరకాలు ఎక్కువ శక్తిని రిలీజ్ చేస్తాయి. కానీ వాటి కోసం సంక్లిష్టమైన టెక్నాలజీ అవసరం ఉంటుంది. ఆ క్షిపణుల బరువు కూడా మరీ అధికంగా ఉంటుంది. ఇక ఘన ఇంధనం .. ఎక్కవ సాంద్రతతో ఉంటుంది. చాలా తొందరగా అది అంటుకుంటుంది. సాలిడ్ ఫ్యూయల్ ఎక్కువ కాలం డీగ్రేడ్ కాకుండా ఉంటుంది.
ఏం జరుగుతుంది..
కొత్త సాలిడ్ ఐసీబీఎంను డెవలప్ చేయడం వల్ల నార్త్ కొరియా తన న్యూక్లియర్ కౌంటర్ అటాక్ సామర్థ్యాన్ని పెంచుకుంటుంది. హాసాంగ్-18 క్షిపణితో అది అటాక్ చేసేందుకు సిద్దం అవుతోంది. కానీ ఆ టెక్నాలజీలో మాస్టర్ కావాలంటే నార్త్ కొరియాకు చాలా టైం పడుతుందని దక్షిణ కొరియా పేర్కొన్నది.
0 Comments:
Post a Comment