✍️ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు
♦️ముఖచిత్ర అటెండెన్స్ వేయని 482 మందికి అందజేత
ఆలస్యంగా విధులకు వెళ్తున్న వారూ గుర్తింపు
♦️రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని. జిల్లా విద్యాశాఖ నుంచి ఆదేశాలు
*🌻కంకిపాడు*: పాఠశాల పనివేళల్లో తమ ముఖచిత్ర గుర్తింపు విధానంలో అటెండెన్సు నమోదు చేయని ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ షోకాజ్ నోటీసు లను జారీ చేసింది. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించినందుకు చర్యలు ఎందుకు తీసుకో కూడదో రెండు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని పేర్కొంది. జిల్లా వ్యాప్తంగా 482 మంది ఉపాధ్యా యులకు బుధవారం జిల్లా విద్యాశాఖ నుంచి షోకాజ్ నోటీసులు జారీ కావటం చర్చనీయాంశం. గా మారింది. ప్రభుత్వ ఆదేశాలతో ముఖచిత్ర ఆధా రిత అటెండెన్సుకు పైలెట్ ప్రాజెక్టుగా కృష్ణా జిల్లానే ఎంపిక చేశారు. విజయవంతంగా ఈ ప్రక్రియను ఉపాధ్యాయులు పూర్తి చేస్తూ వస్తున్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి ప్రభుత్వ ఆదేశాలతో ఒంటిపూట బడులు మొదలయ్యాయి. నిబంధనల ప్రకారం ఉదయం 7.45 గంటలకే ఉపాధ్యాయులు పాఠశా లకు హాజరుకావాల్సింది. పాఠశాల పని వేళల్లో విధులకు వచ్చిన ఉపాధ్యాయులు తప్పనిసరిగాముఖ ఆధారిత ఆటిండెను (ఎఫ్ఆర్ఎస్) వేయాల్సి ఉంది.
♦️సకాలంలో హాజరుకాని ఉపాధ్యాయులు...
ఏప్రిల్ 3 నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం కావటంతో చాలా మంది ఉపాధ్యాయులు సకాలం లో పాఠశాలలకు చేరుకోవటం లేదు. డ్యాష్ బోర్డు మానిటరింగ్ సెల్ ఈ విషయాన్ని ఎస్ఆర్ఎస్ ద్వారా గుర్తించింది. ఈ నెల 11వ తేదీన సుమా రుగా 751 మంది విధులకు ఆలస్యంగా హాజరై నట్లు గుర్తించింది. అంతేకాకుండా 482 మంది ఉపా ధ్యాయులు ఎస్ఆర్ఎస్ నమోదు చేయాలని నిర్ధా రించింది. ఈ మేరకు సంబంధిత ఉపాధ్యాయుల పూర్తి వివరాలతో కూడిన జాబితాను జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి పంపింది.
♦️అలసత్వం ఉంటే చర్యలు
విధి నిర్వహణలో అలసత్వంగా వ్యవహరిస్తే సహించేది లేదు. షోకాజ్ నోటీసులు అందు కున్న ఉపాధ్యాయులు ఇచ్చిన వివరణ సంతృ ప్తికరంగా ఉంటే చర్యలు ఉండవు, అదే నిర్లక్ష్య ధోరణి కనిపిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుం టాం. సకాలంలో పాఠశాలకు హాజరుకావాలి. అటెండెన్సు నమోదు చేసుకోవాలి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సంబంధిత ఎంఈఓలకు సైతం షోకాజ్ నోటీసులు ఇస్తాం. చర్యల్లో ఎక్కడా రాజీపడేది లేదు. విద్యార్థులకు చదువు విష యంలో నష్టం వాటిల్లకుండా అవసరమైన అన్ని చర్యలూ సమర్ధంగా చేపడతాం.
- తాహెరా సుల్తానా, డీఈఓ, కృష్ణాజిల్లా
♦️పనితీరు గాడిన పడేలా...
అటెండెన్సు నమోదు కాని 482 మంది ఉపాధ్యాయుల జాబితాను డ్యాష్ బోర్డు మానిటరింగ్ సెల్ నుంచి విద్యాశాఖ అందుకుంది. ఈ మేరకు సంబంధిత ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులను జారీ చేస్తూ జిల్లా విద్యాశాఖ చర్యలు తీసుకుంది. చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ రెండు రోజుల్లో విద్యాశాఖకు తెలియజేయాలని నోటీసుల్లో పేర్కొంది. ఉపాధ్యా యుల్లో ఇంకా కొందరు అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణి.. నివారించి పనితీరు గాడిన పడేలా విద్యాశాఖ సమర్ధ్యం. గా చర్యలు చేపట్టింది.
0 Comments:
Post a Comment