SBI News: ఎస్‌బీఐ అదిరిపోయే శుభవార్త.. కస్టమర్లకు కొత్త సర్వీసులు, ఇక బ్యాంక్‌కు వెళ్లకుండానే..
State Bank of India | దిగ్గజ బ్యాంక్, దేశంలోనే అతిపెద్ద బ్యాంక్‌గా కొనసాగుతూ వస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తాజాగా తన కస్టమర్లకు తీపికబురు అందించింది.
కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రెడీ వుతోంది. దీని వల్ల కస్టమర్లకు బెనిఫిట్ కలుగనుంది.
ఎస్‌బీఐ ఐరిష్ స్కానర్ సర్వీసులు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. దీని వల్ల సీనియర్ సిటిజన్స్‌కు ఎక్కువగా బెనిఫిట్ ఉంటుందని చెప్పుకోవచ్చు. పెన్షన్ పొందటానికి ఇబ్బంది పడాల్సిన పని ఉండదు. ఈజీగానే పెన్షన్ పొందొచ్చు.
సీనియర్ సిటిజన్స్‌కు కొంత మందికి ఫింగర్ ప్రింట్ సరిగా పడకపోవచ్చు. ఇలాంటి వారికి పెన్షన్ పొందడంలో ఇబ్బందులు రావొచ్చు. అందుకే ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి ఎస్ఐబీ ఐరిష్ స్కానర్ సర్వీసులు అందుబాటులోకి తీసుకురానుంది.
బ్యాంకింగ్ కరస్పాండెంట్స్ లేదా సర్వీస్ కస్టమర్ పాయింట్ల వద్ద ఐరిష్ స్కానర్ సేవలు అందుబాటులో ఉండేలా ఎస్‌బీఐ తగిన చర్యలు తీసుకోనుంది.ఈ సర్వీసులు అందుబాటులోకి వస్తే.. బ్యాంక్ కస్టమర్లకు మరో బెనిఫిట్ కూడా ఉండనుంది.
సీనియర్ సిటిజన్స్ బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాల్సిన పని లేదు. పెన్షన్ మొత్తాన్ని దగ్గరిలోని బ్యాంకింగ్ మిత్రా ఛానల్ వద్దకు వెళ్లి విత్‌డ్రా చేసుకోవచ్చు. బ్యాంక్‌కు వెళ్లాల్సిన పని ఉండదు. ఇది చాలా ఊరట కలిగే నిర్ణయం అని చెప్పుకోవచ్చు.
సీనియర్ సిటిజన్స్ లేదంటే కస్టమర్లు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు బీసీ లేదా సీఎస్‌పీ (బ్యాంక్ మిత్ర) వద్ద ఐరిష్ స్కానర్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రెడీ అవుతున్నామని ఎస్‌బీఐ తెలిపింది.
అయితే ఇటీవల ఒక సంఘటన చోటుచేసుకుంది. సీనియర్ సిటిజన్ పెన్షన్ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవడంలో చాలా ఇబ్బందులు పడ్డారు. బ్యాంక్ మిత్ర వద్ద ఫింగర్ ప్రింట్ పడకపోవడంతో.. పెన్షన్ డబ్బుల కోసం కుర్చి పట్టుకొని చెప్పులు లేకుండా సీనియర్ సిటిజన్ బ్యాంక్‌కు వెళ్లాల్సి వచ్చింది.
ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఈ ఘటనపై స్పందించారు. మనుషులుగా ఉండాలని, మానవత్వంతో ఉండాలని సూచించారు. ఈ ఘటన ఒడిశాలో చేటుచేసుకుంది.
ఈ క్రమంలోనే ఎస్‌బీఐ ఆమెకు వీల్ చైర్ ఉచితంగా అందించింది. ఇంకా ఇంటి వద్దకే పెన్షన్ వచ్చేలా ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చింది. అందుకే ఇప్పుడు బ్యాంక్ మిత్ర లేదా సర్వీస్ పాయింట్లకు సంబంధించిన రూల్స్‌ను కూడా సవరిస్తున్నట్లు ఎస్‌బీఐ వెల్లడించింది.
ఏదేమైనా కొత్త సర్వీసుల వల్ల ప్రధానంగా సీనియర్ సిటిజన్స్‌కు ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఎక్కువ దూరం వెళ్లాల్సిన పని లేకుండా ఈజీగానే పెన్షన్ డబ్బులు పొందే వెసులుబాటు లభిస్తుంది.
0 Comments:
Post a Comment