రైతు బిడ్డ కృషి.. వాహనాలకు యాక్సిడెంట్ సెన్సార్.. ఇది రియల్ చిత్రలహరి
మీరు సాయిధరమ్ తేజ్ చిత్రాలహరి సినిమా చూశారా.. అందులో హీరో... రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు.. వెంటనే బాధితుల కుటుంబ సభ్యులు, పోలీసులూ, అంబులెన్స్‌కి ఆటోమేటిక్‌గా సిగ్నల్స్ వెళ్లేలా ఓ యాప్ తయారుచేస్తాడు. అది సినిమా. కానీ రియల్ గానే దాదాపు అలాంటి దాన్ని తయారుచేశాడు ఓ కుర్రాడు.
మహారాష్ట్రలోని జల్నాకు చెందిన ఆ యువకుడు యాక్సిడెంట్ అలర్ట్ సెన్సార్‌ను తయారు చేశాడు. అది ఇప్పుడు స్థానికంగా ప్రశంసలు అందుకుంటోంది.
ప్రమాదం జరిగినట్లుగా కుటుంబ సభ్యులు తెలుసుకునేందుకు జల్నాకు చెందిన ఆ యువకుడు కొత్త టెక్నిక్ కనిపెట్టాడు. ప్రమాదం జరిగిన తర్వాత.. పోలీసులు, కారు డ్రైవర్ కుటుంబ సభ్యులకు వెంటనే కాల్స్, ప్రమాదం ఎక్కడ జరిగిందో తెలిపే లొకేషన్ వివరాలు వెళ్లిపోయేలా చేస్తున్నాడు.
అంబాద్ తాలూకాలోని దూద్‌పురి గ్రామానికి చెందిన రాజేంద్ర పచ్‌ఫులే అనే యువకుడు ప్రమాద హెచ్చరికల సెన్సార్‌ను తయారు చేశాడు. ఈ చిన్న యంత్రంలో పోలీసులు, కుటుంబ సభ్యుల మొబైల్ నంబర్లను కోడ్ చేశాడు.
ఆ సెన్సార్ పరికరాన్ని వాహనానికి తగిలిస్తన్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే.. దాని నుంచి.. అందులో కోడ్ చేసిన మొబైల్స్‌కి హెచ్చరిక సందేశం వెళ్తుంది. తద్వారా వెంటనే పోలీసులు, అంబులెన్స్, కుటుంబ సభ్యులు వెళ్లి.. ప్రాణ హాని నుంచి బాధితులను కాపాడవచ్చు.
జాల్నా జిల్లాలోని దూద్‌పురి అనే కుగ్రామానికి చెందిన రాజేంద్ర పచ్‌ఫులే.. ఇంటి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం. రెండెకరాల పొలంలో అమ్మా, నాన్న కష్టపడి పనిచేస్తూ.. కుటుంబాన్ని పోషిస్తున్నారు
ఆర్థిక సమస్యలతో పోరాడుతూనే రాజేంద్ర... 3 నెలల స్కిల్ డెవలప్ మెంట్ కోర్స్ చేశాడు. ఆ తర్వాత ఈ ఆలోచన వచ్చి 'యాక్సిడెంట్ అలర్ట్ సెన్సార్' తయారుచేశాడు..
దేశంలో రోడ్లపై రోజూ అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలా ప్రమాదాల్లో అధికార యంత్రాంగానికి వెంటనే సమాచారం వెళ్లట్లేదు. ఫలితంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ చిన్న పరికరం ప్రాణాలు కాపాడగలదు. దీనికి పేటెంట్ పొంది.. త్వరలో మరింతగా దీన్ని డెవలప్ చేయడానికి రెడీ అవుతున్నాడు రాజేంద్ర. అతనికి ఆల్ ది బెస్ట్ చెప్పేద్దామా.
0 Comments:
Post a Comment