ఇండియాలో సేఫ్టీ కారు.. చవకైనది కూడా.. వెన్యూ, విటారాలను వెనక్కి నెట్టింది
టాటా పంచ్ (Punch)...
5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో వస్తున్న భారతదేశంలో అత్యంత చవకైన కారు. ఇది సబ్ కాంపాక్ట్ SUV. ఇది 5 మందికి సరిపడా సీటింగ్ కెపాసిటీ కలిగివుంది. అద్భుతమైన గ్రౌండ్ క్లియరెన్స్ అందిస్తుంది. కారు భారీ బూట్ స్పేస్‌ను కూడా కలిగివుంది. ఇందులో చాలా లగేజీని ఉంచవచ్చు. ఈ మైక్రో SUV పూర్తిగా పెద్ద వాహనం లాంటి అనుభూతిని ఇస్తుంది. (Image credit : tata motors)
టాటా పంచ్... అక్టోబర్ 20, 2021న భారతదేశంలో లాంచ్ అయ్యింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.6 లక్షల నుంచి మొదలై రూ.9.47 లక్షల ఎక్స్-షోరూమ్ వరకు ఉంది. టాటా పంచ్ 4 వేరియంట్‌లలో లభిస్తోంది. అవి ప్యూర్, అడ్వెంచర్, ఎకాంప్లిష్డ్, క్రియేటివ్ (Image credit : tata motors)
టాటా పంచ్ భారతీయ మార్కెట్లో... మారుతి సుజుకి స్విఫ్ట్, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, మహీంద్రా KUV100 NXT, మారుతి సుజుకి ఇగ్నిస్, రెనాల్ట్ ట్రైబర్ వంటి వాహనాలతో పోటీ పడుతోంది. మార్చిలో అమ్మకాల రికార్డును పరిశీలిస్తే, 10,894 యూనిట్ల విక్రయాలతో పంచ్.... టాప్ 10 కార్ల లిస్టులో ప్రవేశించింది. వెన్యూ, విటారా కూడా అమ్మకాలలో వెనుకబడి ఉన్నాయి. (Image credit : tata motors)
టాటా పంచ్ 7 కలర్స్ ఎంపికలలో లభిస్తుంది. ఓర్కస్ వైట్, డేటోనా గ్రే, ట్రాపికల్ మిస్ట్, అటామిక్ ఆరెంజ్, మెటోర్ బ్రాంజ్, టోర్నాడో బ్లూ, కాలిప్సో రెడ్. ఇవి కాకుండా, పంచ్ కొన్ని ప్రత్యేక ఎంపికలలో కూడా అందుబాటులో ఉంది. (Image credit : tata motors)
టాటా పంచ్ ఫీచర్స్ చూస్తే... స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ డిజైన్, LED DRLలు, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు కలిగివుంది. డ్యూయల్-టోన్ బంపర్లు, ఫాగ్ లైట్లు, సింగిల్ స్లాట్ గ్రిల్, 16-అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, సి-పిల్లర్ మౌంటెడ్ రియర్ డోర్ హ్యాండిల్స్, 90-డిగ్రీ ఓపెనింగ్ డోర్లు, LED టెయిల్‌లైట్లు ఉన్నాయి. (Image credit : tata motors)
టాటా పంచ్ ప్రత్యేకంగా 1.2-లీటర్ 3-సిలిండర్... రెవోట్రాన్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది, ఇది 84bhp శక్తిని, 113Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా AMT యూనిట్ ద్వారా ముందు చక్రాలకు శక్తిని పంపుతుంది. (Image credit : tata motors)
టాటా పంచ్‌లో 7-అంగుళాల హర్మాన్-సోర్స్డ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్-అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, లెదర్-ర్యాప్డ్ ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, కాంట్రాస్ట్ కలర్ యాక్సెంట్‌లతో కూడిన దీర్ఘచతురస్రాకార AC వెంట్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. డ్రైవ్ మోడ్‌లు (సిటీ, ఎకో), iRA టెక్నాలజీ, అత్యంత సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు ఈ కారుకు ఉన్నాయి. (Image credit : tata motors)
0 Comments:
Post a Comment