✍️మీపై చర్యలు ఎందుకు తీసుకోకూడదు?
♦️అవనిగడ్డలో విద్యాశాఖ అధికారులపై ప్రవీణ్ ప్రకాష్ ఆగ్రహం
🌻అవనిగడ్డ టౌన్, ఏప్రిల్ 1: విధి నిర్వ హణలో అలసత్వం వహిస్తున్న మీపై చర్యలు:- ఎందుకు తీసుకోకూడదంటూ పాఠశాల విద్యా శాఖ అధికారులపై ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణ, తనిఖీల్లో భాగంగా శనివారం రాత్రి అవనిగడ్డ బాలుర సోషల్ వెల్ఫేర్ వసతిగృహానికి వచ్చిన ఆయన 7వ తరగతి విద్యార్థుల నోటు పుస్త కాలను పరిశీలించారు. ఆరుగురికి నలుగురి వద్దే వర్క్స్ బుక్స్ ఉండగా, మిగిలిన ఇద్దరు తమకింకా ఇవ్వలేదని చెప్పారు. దీంతో ఎంఈవో శివశంకరరావుపై తీవ్రస్థాయిలో ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. వర్క్ బుక్స్ ఉన్న నలుగురి పుస్తకాలను తనిఖీ చేసి అం దులో వారు తప్పులు రాసినప్పటికీ వాటిని పరిశీలించకుండా ఆమోదించిన ఉపాధ్యా యుడు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న వసతి గృహ సంక్షేమాధికారి బాబూరావు, డివైఈవో సుబ్బా రావు, డీఈవో తాహెరా సుల్తానాపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని నిలదీశారు. సరిగా తనిఖీలు జరుపకుండా అలక్ష్యం వ హించటంతోనే ఇలాంటి పరిస్థితులు తలెతుతున్నాయనీ, జిల్లాలో ఇప్పటివరకూ డీఈవో, డీవైఈవో ఎన్ని పాఠశాలలు తనిఖీ చేశారో వివరాలు కావాలని ఆదేశించారు. విధులు సరిగా నిర్వహించని ఎంఈవోలు, ఉపాధ్యా యులపై ఏం చర్యలు తీసుకున్నాడని ప్రశ్నిం. చారు. తాము తరచుగా తనిఖీలు నిర్వహిస్తున్నామనీ, ఇప్పటివరకూ మూడుచోట్ల మెమో లు ఇచ్చామని డీఈవో తాహెరా సుల్తానా వివరించారు. చల్లపల్లి మండలానికి చెందిన ఉపాధ్యాయుడు విధులకు సరిగా హాజరు. కావటం లేదంటూ డీఈవో ఇచ్చిన సర్క్యుల ర్ను ఆవనిగడ్డ మాజీ జడ్పీటీసీ సభ్యుడు కొల్లూరి వెంకటేశ్వరరావు, పెదపాలెం సర్పంచ్ దున్నా రాజేష్ లు ప్రవీణ్ ప్రకాష్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆ నోటీసులో ఏం చర్యలకు సిఫారసు చేశారో అర్ధం కావటం లేదని వివరించారు. పరిశీలించి చర్యలు తీసు కుంటామని ఆ కాపీని వారి నుంచి ప్రవీణ్ ప్రకాష్ తీసుకున్నారు.
♦️చదువుకు ఇబ్బంది కలిగితే సహించం.
విద్యార్థులను తీర్చిదిద్దటంలో విఫలమైతే ఎంతటివారిపైనైనా చర్య తీసుకునేందుకు వెను కాడబోమని ప్రవీణ్ ప్రకాష్ హెచ్చరించారు. " ఇకపై ఎక్కడైనా పర్యవేక్షణలోపం వల్లగానీ, ఉపాద్యాయుల నిర్లక్ష్యం వల్ల గానీ విద్యా ర్దులకు.. చదువుకు ఇబ్బంది కలిగితే సహించేది " లేదని, ఇకపై పునరావృతం కాకుండా చూసుకోవాలనీ, పునరావృతమైతే ఎంతటి వారినైనా ఉపేక్షించేదిలేదని ప్రవీణ్ ప్రకాష్ హెచ్చరించారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
0 Comments:
Post a Comment