PM Modi Degree Certificate: మోదీ ఎడ్యుకేషన్ గురించి అడిగిన కేజ్రీవాల్‌కు జరిమానా
ప్రధాని మోదీ క్వాలిఫికేషన్ ఏంటో చెప్పాలంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ హైకోర్టులో పిటిషన్ వేశారు.
దీనిపై విచారణ జరిపిన కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రధానమంత్రి కార్యాలయం ఈ వివరాలు చెప్పాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. గుజరాత్, ఢిల్లీ యూనివర్సిటీల పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ద్వారా ఈ వివరాలు బయట పెట్టాలన్న పిటిషన్ను కొట్టి వేస్తూ ఈ తీర్పునిచ్చింది. ఇది అనవసరమైన విషయం అని వెల్లడించింది. అంతే కాదు. ఈ పిటిషన్ వేసిన అరవింద్ కేజ్రీవాల్కు రూ.25 వేల జరిమానా కూడా విధించింది గుజరాత్ హైకోర్టు. ఈ మేరకు ఈ జరిమానాను గుజరాత్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. నిజానికి 2016లోనే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్..గుజరాత్ యూనివర్సిటీకి సూచనలు చేసింది. ప్రధాని మోదీ విద్యార్హతలేంటో చెప్పాలని అడిగింది. దీనిపైనే విచారణ చేపట్టిన కోర్టు..ఆ అవసరమే లేదంటూ స్పష్టం చేసింది.
ఈ తీర్పుపై అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ప్రధాని ఏం చదువుకున్నాడో తెలుసుకోవడం కూడా తప్పేనా అంటూ మండి పడ్డారు. ఆయన విద్యార్హతలేంటో చెప్పడానికి సమస్యేంటని ప్రశ్నించారు.
"ప్రధాని నరేంద్ర మోదీ ఏం చదువుకున్నారో తెలుసుకునే హక్కు దేశానికి లేదా? కోర్టులో ఆయన డిగ్రీ క్వాలిఫికేషన్ చూపించేందుకు ఎందుకంత సమస్య? ఆయన డిగ్రీ ఏంటో తెలుసుకోవాలనుకున్న వారిపై ఫైన్ వేస్తారా? ఏం జరుగుతోంది? ఇలాంటి ప్రధాని దేశానికి ప్రమాదకరం"
- అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి
0 Comments:
Post a Comment