PM Kisan Scheme: పీఎం కిసాన్ రూ.2000 పొందే రైతులకు హెచ్చరిక.. ఈ తప్పు చేస్తే జైలుకే, డబ్బులు వెనక్కి ఇవ్వాల్సిందే!
PM Kisan Samman Nidhi | కేంద్ర ప్రభుత్వం అన్నదాతల కోసం ప్రత్యేకమైన స్కీమ్ అందుబాటులో ఉంచింది.
అదే ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఈ పథకంలో చేరిన వారికి మోదీ సర్కార్ ఏటా ఉచితంగానే బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమ చేస్తోంది.
అర్హత కలిగిన రైతులకు ఉచితంగా ప్రతి సంవత్సరం రూ. 6 వేలు అందుతున్నాయి. ఈ డబ్బులు ఒకేసారి కాకుండా విడతల వారీగా రూ. 2 వేల చొప్పున అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతున్నాయి. అంటే నాలుగు నెలలకు ఒకసారి రూ. 2 వేల చొప్పున మూడు సార్లు అన్నదాతకు ఏటా డబ్బులు లభిస్తున్నాయి.
ఇలా పీఎం కిసాన్ స్కీమ్ కింద డబ్బులు పొందే రైతులు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. అర్హతలు లేకపోయినా కూడా పీఎం కిసాన్ స్కీమ్ కింద డబ్బులు పొందే వారికి కేంద్రం ఝలక్ ఇచ్చింది. కఠిన చర్యలు తీసుకోనుంది.
ఎవరైతే అర్హత లేకపోయినా కూడా పీఎం కిసాన్ స్కీమ్ కింద డబ్బులు పొందుతూ ఉంటే.. వారి నుంచి కేంద్ర ప్రభుత్వం మళ్లీ ఆ డబ్బులను వెనక్కి తీసుకోనుంది. అందువల్ల అర్హత లేని వారు డబ్బులు వెనక్కి చెల్లించాల్సి ఉంటుందని గుర్తించుకోవాలి.
అంతేకాకుండా ఒకే కుటుంబంలో ఒకరి కన్నా ఎక్కువ మంది పీఎం కిసాన్ స్కీమ్ కింద డబ్బులు పొందుతూ ఉంటే.. అలాంటి వారు కూడా డబ్బులు వెనక్కి చెల్లించాల్సి ఉంటుంది. అంటే రూ.2 వేలు వెనక్కి ఇవ్వాల్సి వస్తుంది.
పీఎం కిసాన్ స్కీమ్ కింద ఒక కుటుంబంలో కేవలం ఒక్కరికి మాత్రమే పీఎం కిసాన్ స్కీమ్ కింద రూ. 2 వేలు లభిస్తాయి. మిగతావ వారికి డబ్బులు రావు. ఒకవేళ డబ్బులు వెనక్కి ఇవ్వక్కపోతే అప్పుడు జైలు కూడా వెళ్లాల్సి రావొచ్చు.
ఛత్తీస్‌గడ్‌లో దాదాపు దాదాపు 50 వేల మందికి పైగా అర్హత లేని వారు పీఎం కిసాన్ డబ్బులు పొందినట్లు మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి. వీరందరినీ ప్రభుత్వం గుర్తించినట్లు తెలుస్తోంది. డబ్బులు వెనక్కి చెల్లించాలని కోరింది. డబ్బులు చెల్లించిన తర్వాత వీరి పేరును పీఎం కిసాన్ పోర్టల్ నుంచి తొలగిస్తారు.
ఫేక్ డాక్యుమెంట్ల ద్వారా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇలా కొంత మంది అర్హత లేకుండా పీఎం కిసాన్ ప్రయోజనాలు పొందుతున్నారనే విషయాన్ని ఆయా ప్రభుత్వాలు గుర్తించాయి. వీరందరూ డబ్బులు వెనక్కి చెల్లించాల్సి ఉంటుంది. లేదంటే జైలుకు వెళ్లాల్సి రావొచ్చు. అందువల్ల అర్హత లేకపోతే మాత్రం ఈ స్కీమ్‌కు దూరంగా ఉండటం ఉత్తమం.
0 Comments:
Post a Comment