✍️ఉపాధ్యాయ ఖాళీలు 1,179!
♦️1998-డీఎస్సీ అభ్యర్థులతో 4,072 పోస్టులు భర్తీ
♦️ఇక మిగిలింది ఇవేనని వెల్లడించిన ప్రభుత్వం
♦️7లక్షల మంది నిరుద్యోగుల డీఎస్సీ ఆశలపై నీళ్లు
*🌻అమరావతి, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి):* ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఇక లేన ట్టేనని ప్రభుత్వం అధికారికంగా తేల్చేసింది. ఒకవేళ భర్తీ చేపట్టాల్సి వచ్చినా మిగిలింది కేవలం 1,179 పోస్టులు మాత్రమేనని లెక్కగట్టింది. శుక్రవారం విడుదల చేసిన 1998 డీఎస్సీ అభ్యర్థుల నియామకపు ఉత్తర్వుల్లో ఈ విష యాన్ని స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 5,251 పోస్టులు ఖాళీగా ఉన్నా యని, కాంట్రాక్టు పద్ధతిలో 4,072 మంది 1998 డీఎస్సీ అభ్యర్థులను విధు ల్లోకి తీసుకోవాలంటూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. మొత్తం ఖాళీల్లో ఇవి పోగా మిగిలేది 1,179 పోస్టులే. కొన్ని జిల్లాల్లో ఖాళీలు అసలు లేవని, పక్క జిల్లాల నుంచి సర్దుబాటు చేసినట్లు తెలిపింది. గుంటూరు, ప్రకాశం, కడప, కర్నూలు జిల్లాలో ఒక్క పోస్టు కూడా ఖాళీ లేదని, నూరుశాతం టీచర్లు ఉన్నారని పేర్కొంది. కాగా, ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో కేవలం 717 టీచర్ పోస్టులే ఖాళీగా ఉన్నాయని విద్యాశాఖ. మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. తుది లెక్కల్లో ఆ సంఖ్య స్వల్పంగా పెరిగింది. కాగా, గతేడాది నిర్వహించిన టెట్ కు 5.25 లక్షల దర ఖాస్తులు వచ్చాయి. ఇంకా దరఖాస్తు చేయనివారు ఉన్నారు. సుమారు 7లక్షల మంది వరకు డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నారు. వారందరూ ఈ పోస్టుల కోసం పోటీ పడాలని ప్రభుత్వం తాజా ఉత్తర్వులతో తేల్చేసింది.
♦️12, 13 తేదీల్లో కౌన్సెలింగ్
1998-డీఎస్సీ అభ్యర్థులకు ఈ నెల 11న సమాచారం ఇవ్వనున్నట్లు పాఠ శాల విద్యాశాఖ ఉత్తర్వుల్లో తెలిపింది. 12, 13 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వ హించి, నియామకపు ఉత్తర్వులు జారీ చేస్తారని వివరించింది. ఈ నియా మకాలు పూర్తిగా కాంట్రాక్టు ప్రాతిపదికన ఉంటాయని, రెగ్యులర్ ఉద్యోగు లకు వచ్చే ప్రయోజనాలు వీరికి వర్తించవని స్పష్టం చేసింది. ఉద్యోగంలో చేరిన ఏడాదిలోగా ఎలిమెంటరీ విద్యలో ఆరు నెలల బ్రిడ్జి కోర్సు పూర్తిచే యాలని, ఈ అభ్యర్థులను ఎస్టీలుగా తీసుకుంటున్నట్లు పేర్కొంది.
0 Comments:
Post a Comment