చంద్రుడి మీద మొదటగా నీల్ అర్మ్ స్ట్రాంగ్ కాలు పెట్టారని అందరికీ తెలిసిందే. కానీ మహిళలేవరు ఇంతవరకు చంద్రునిపై కాలు మోపలేదు. అయితే ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది.
కానీ మహిళలేవరు ఇంతవరకు చంద్రునిపై కాలు మోపలేదు. అయితే ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది.
అమెరికాకు చెందిన క్రిస్టినా హామ్మొక్ కోచ్ అనే మహిళ వ్యోమగామి చంద్రని మీద అడుగుపెట్టబోయే మొదటి మహిళగా రికార్డు సృష్టించనున్నారు.
ఈ విషయాన్ని నాసా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. అర్టెమిస్ II లూనార్ మూన్ టీమ్ లోని నలుగురు సభ్యల్లో క్రిస్టినా కోచ్ ఒకరు. అయితే ఈ మిషన్ లో ఆమెతో పాటు జెరెమీ హన్సెన్, విక్టర్ గ్లోవర్ , రెయిడ్ వైజ్ మెన్ భాగస్వామ్యం కానున్నారు.
ఈ వ్యోమగాములు చంద్రునిపైకి వెళ్లాక అక్కడ సుమారు పదిరోజుల పాటు పరిశోధనలు చేయనున్నారు.
అయితే క్రిస్టినా కోచ్ 2019లోనే స్పేస్ స్టేషన్ కి వెళ్లారు. 2013లో ఆమె నాసాలో చేరారు. ఈ క్రమంలోనే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఫ్లైజ్ ఇంజనీర్ గా ఆమె పనిచేశారు.
చంద్రుని మీదకి వెళ్లే సమయం రావడంతో క్రిస్టినా ఆనందం వ్యక్తం చేశారు.
ఈ మిషన్ లో పాల్గొనడం గర్వంగా ఉందని..చంద్రుని పైకి వెళ్తామనే ఆలోచన థ్రిల్లింగా ఉందని పేర్కొన్నారు. అయితే 2024లో అర్టెమిస్ II లూనార్ మూన్ మిషన్ చంద్రునిపైకి వెళ్లనుంది.
0 Comments:
Post a Comment