Muskmelon: సమ్మర్ ఫ్రూట్ ఖర్బూజతో బరువు తగ్గే అవకాశం..హెల్త్ బెనిఫిట్స్ ఇవే..
Muskmelon: వేసవిలో లభించే అద్భతమైన సీజనల్ ఫ్రూట్స్‌లో ఖర్బూజ(Muskmelon) ఒకటి. ఎండాకాలంలో తీవ్రమైన వేడి నుంచి శరీరాన్ని చల్లబర్చడంలో ఈ పండు కీలక పాత్ర పోషిస్తుంది.
ఇందులో విటమిన్ ఏ, సీ, ఫైబర్ అధికంగా ఉంటాయి. దీంతో శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా అందుతాయి. వాటర్ కంటెంట్ మోతాదు కూడా ఇందులో ఎక్కువే. దీంతో వేసవిలో వడదెబ్బ తగలకుండా శరీరం హైడ్రేట్‌గా ఉంచుకోవచ్చు. బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఖర్బూజను తరచూ తీసుకుంటే బరువు కూడా తగ్గవచ్చు. అందుకు కారణాలను పరిశీలిద్దాం.
* ఫ్యాట్ తగ్గించడంలో కీలకం
ఖర్బూజలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది. ఈ వేసవి పండులో నీటి శాతం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో దీన్ని తరచూ తినడం వల్ల పొట్ట నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. ఫలితంగా ఆకలి తగ్గుతుంది. దీంతో ఇతర ఫుడ్స్‌ను ఎక్కువ మోతాదులో తినలేరు. ఇలా బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు.
* ఫైబర్ సోర్స్
ఖర్బూజలో మెలోన్ అనే పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పండును క్రమం తప్పకుండా తింటే, శరీరానికి చల్లదనంతో పాటు జీర్ణవ్యవస్థ పనితీరు వేగవంతం అవుతుంది. ఖర్బూజ శరీరంలోని నీటిని సంగ్రహిస్తూ జీవక్రియ రేటును పెంచుతుంది. జీవక్రియ రేటు ఎక్కువగా ఉన్నప్పుడు, శరీరంలోని కొవ్వు కూడా ఆటోమెటిక్‌గా వేగంగా కరుగుతుంది. దీంతో బరువు తగ్గే అవకాశం ఉంది.
* తక్కువ కేలరీలు
ఖర్బూజ రుచికి తియ్యగా ఉంటుంది. కాబట్టి వేసవిలో చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ల వరకు అందరూ ఎంతో ఇష్టంగా ఈ పండును తింటుంటారు. పైగా ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇది తీపి పదార్థాలను తినాలనే కోరికను ఇది తగ్గిస్తుంది. తద్వారా బరువు తగ్గడానికి కృషి చేస్తుంది.
* ఇతర ఆరోగ్య ప్రయోజనాలు
ఖర్బూజలో మాంసకృత్తులు, సోడియం, ఫోలిక్ ఆమ్లం, విటమిన్ బి6, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. దీంతో దీన్ని వేసవిలో తీసుకుంటే రోగ నిరోధక శక్తి బలోపేతం అవుతుంది. ఇందులోని మెగ్నీషియం, పొటాషియం శరీర రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతో గుండె జబ్బుల రిస్క్ తక్కువగా ఉంటుంది. ఖర్బూజలోని పీచు మలబద్దకాన్ని నివారిస్తుంది. శరీరంలోని వ్యర్థాలను శరీరం నుంచి బయటకు పంపుతుంది.
* ఎన్ని విధాలుగా తీసుకొచ్చంటే?
బరువు తగ్గాలనుకునే వారు ఖర్బూజను అనేక విధాలుగా తీసుకోవచ్చు. ఉదయం అల్పాహారం సమయంలో ఈ పండును నేరుగా తినవచ్చు. దీనివల్ల బరువు త్వరగా తగ్గవచ్చు. మరింత రుచికోసం సలాడ్ లేదా స్మూతీ(పానీయం) రూపంలో కూడా తీసుకోవచ్చు.
0 Comments:
Post a Comment