Money Earning Tips: రూ.35 వేల జీతం.. చక్కగా టీచర్ ఉద్యోగం చేసుకోక ఇలాంటి పనులేంటని అంతా తిట్టారు.. ఇప్పుడు ఆమె సంపాదన ఎంతో తెలిస్తే..
ఆమె ఒక టీచర్.. గౌరవప్రదమైన వృత్తి. సమాజంలో కూడా మంచి గౌరవ మర్యాదలు. కానీ ఉన్నట్టుండి ఆమె కొత్త రంగంలోకి అడుగుపెట్టింది. ఆమె పనులు చూసి అంతా తిట్టుకున్నారు.
ఉద్యోగం చేసుకోక.. ఇవ్వేం పనులంటూ అందరూ ఈసడించుకున్నారు. అసలు ఇంతకీ ఏమైంది? ఆమె చేసిన నిర్వాకం ఏంటి? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.
ఈ మధ్య ప్రైవేటు సంస్థల్లో లక్షల్లో సంపాదించే ఉద్యోగస్తులంతా బిజినెస్‌ల బాట పడుతున్నారు. ఇలాంటి వార్తలు ఎన్నో చూశాం. విన్నం కూడా. ఎందుకు ఇలా చేస్తున్నారనుకున్న వాళ్లంతా ముక్కున వేలువేసుకున్న సందర్భాలున్నాయి. కారణం ఏంటంటే.. ఉద్యోగంలో వచ్చే జీతం కంటే వ్యాపారంలోనే ఎక్కువగా సంపాదించడమే ఇందుకు కారణం.
పూసిక యాదవ్ వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు (teacher). అయితే ఉన్నట్టుండి ఉద్యోగానికి రిజైన్ చేసి మత్స్య వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ఉద్యోగం చేసేటప్పుడు రూ.35 వేలే సంపాదిస్తే.. ఇప్పుడు ఏకంగా లక్షల్లో అర్జిస్తోంది. ఆమె తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని ఫిరోజాబాద్‌లో చోటుచేసుకుంది.
ఫిషింగ్ వ్యాపారాన్ని (Fishing business) ఆమె కొత్త ఉపాధిగా మార్చుకుంది. జాగ్రత్తగా చేస్తే ఫిష్ వ్యాపారం కూడా మంచి ఆదాయవనరే అని నిరూపించింది. పూసిక యాదవ్ (Pusika Yadav) మత్స్య వ్యాపారంలో చేరకముందు ఉపాధ్యాయురాలిగా పనిచేసేది. ఆమెకు నెలకు రూ.35వేలు జీతం వచ్చేది. ఆ ఆదాయం కుటుంబ అవసరాలకు సరిపోయేది కాదు. దీంతో తన జీవితాన్ని నిలబెట్టే వ్యాపారం కోసం బాగా వెతికింది. చివరకు చేపల వ్యాపారం కలిసొస్తుందని నమ్మింది. అంతే 2020లో చేపల పెంపకం కోసం మూడు చెరువులను నిర్మించింది. చిన్నగా బిజినెస్ ప్రారంభించింది. స్థానిక రైతులు, వ్యాపారులు చేపలు కొనడంతో ఆమెకు వ్యాపారం కలిసొచ్చింది. భారీగా ఆదాయం రావడం మొదలైంది. ఇక తిరుగులేకుండా వ్యాపారంలో దూసుకుపోతుంది.
మొదట్లో శిక్షణ లేని కార్మికులు, అధిక విద్యుత్ బిల్లులు రావడం. చేపల రవాణాకు సరైన సదుపాయాలు లేకపోవడంతో అనేక సవాళ్లను ఎదుర్కొంది. ఈ ఇబ్బందులను గమనించిన ఆమె కార్మికులకు శిక్షణ ఇప్పించింది. అలాగే చేప విత్తనాల్ని రవాణా చేయడానికి వాహనాన్ని సమకూర్చుకుంది. ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ చేపల పెంపకాన్ని మెరుగుపరిచింది. ప్రస్తుతం ఆమె ఏడాదికి 30 టన్నుల చేపల్ని ఉత్పత్తి చేస్తూ రూ.40 లక్షల వ్యాపారం చేస్తోంది. తిట్టినోళ్లే ఇప్పుడు ఆమె సంపాదిస్తున్న ఆదాయాన్ని చూసి శెభాష్ అని మెచ్చుకుంటున్నారు. మనసుంటే మార్గముంటుంది అని నిరూపించింది.
0 Comments:
Post a Comment