ఇంటర్నెట్ డెస్క్: 1976లో మలేషియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదం (Plane Crash)లో సబా (Sabah) రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా పలువురు రాజకీయ నాయకులను బలిగొంది.
ఆ సమయంలో ఈ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించిన నివేదికను జనవరి 25, 1977లోనే తయారు చేసినప్పటికీ కారణాలు మాత్రం వెల్లడించలేదు.
ప్రమాదానికి గల కారణాలను తెలియజేయాలని బాధిత కుటుంబ సభ్యులు, ప్రజలు తీవ్ర స్థాయిలో డిమాండ్ చేశారు. దీంతో మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం (Anwar Ibrahim) ప్రకటన మేరకు తాజాగా నివేదిక విడుదల చేశారు.
దాదాపు 47 ఏళ్ల తర్వాత ప్రమాద కారణాలను బట్టబయలు చేశారు. మలేషియా సివిల్ ఏవియేషన్, ఎయిర్‌ఫోర్స్ డిపార్ట్‌మెంట్, ఆస్ట్రేలియన్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ అధికారుల బృందం ఘటనపై దర్యాప్తు చేసి సమగ్ర నివేదినకు రూపొందించింది.
సముద్రంలోకి దూసుకెళ్లి
21 పేజీల నివేదిక ప్రకారం..''నోమాడ్ విమానాన్ని ఆస్ట్రేలియా ప్రభుత్వ ఎయిర్‌క్రాఫ్ట్ సంస్థ తయారు చేసింది. విమానంలో ఉపయోగించిన టర్బోట్రాప్ ఇంజిన్ సైతం అక్కడే తయారైంది. అగ్నిప్రమాదం, పేలుడు కారణంగానే ప్రమాదం సంభవించిందని నిర్ధారించడానికి ఎటువంటి ఆధారాలు లేవు.
విమానం సబా రాజధాని కోట కినాబాలు(Kota Kinabalu) వద్ద ల్యాండింగ్‌కు చేరువలో ఉండగా సముద్రగర్భంలోకి దూసుకెళ్లింది.
దీంతో పైలట్ (Pilot)తో సహా మొత్తం 10 మంది ప్రయాణికులు మరణించారు. సబా ముఖ్యమంత్రి తున్ ఫుడ్ స్టీఫెన్స్ (Tun Fuad Stephens) సహా ఆర్థిక మంత్రి, సమాచార మంత్రి పలువురు మంత్రులు, నాయకులు ప్రాణాలు కోల్పోయారు'' అని తెలిపింది.
''42 ఏళ్ల పైలట్ ప్రమాద సమయంలో డ్రగ్స్, మద్యం తీసుకున్నట్లు ఎటువంటి ఆధారాలు లేవు. అయితే పైలెట్ పనితీరును తెలిపే లాగ్‌బుక్స్‌లో ఒకటి కాలిపోయింది. మరొకటి చోరీ అయింది. రికార్డు ప్రకారం పైలట్ పనితీరు, శిక్షణ సరిగాలేనట్లు తెలుస్తోంది.
నిజానికి విమానంలో ఇద్దరు పైలట్లు ఉండాలి. కానీ, ఒక్కరే ఉన్నారు. దీంతో కో-పైలట్ స్థానంలో పదో ప్రయాణికుడు కూర్చున్నాడు. అంతకుముందు బయలుదేరిన మరో విమానానికి చెందిన సామగ్రిని ఈ విమానంలో ఉంచారు. అయితే దాన్ని సరిగ్గా లోడ్ చేయలేదు.
ఇది విమాన గురుత్వాకర్షణ కేంద్రాన్ని(Center of Gravity) ప్రభావితం చేసింది. ఇదంతా గమనించకుండానే పైలెట్ విమానాన్ని టేకాఫ్ చేశాడు. ఈ కారణంగా పైలెట్ నియంత్రణ కోల్పోవడంతో విమానం ల్యాండింగ్‌కు చేరువలో ఉండగా ప్రమాదం సంభవించింది.
విమానం సముద్రంలోకి దూసుకెళ్లి కుప్పకూలిపోయింది '' అని నివేదికలో పేర్కొన్నారు. ఈ ప్రమాదం 1976 జూన్ 6న జరిగింది. ఈ తేదీని 'డబుల్‌సిక్స్' ఘటనగా మలేసియా ప్రభుత్వం పిలుస్తోంది.
0 Comments:
Post a Comment