LPG Booking: ఇండేన్, హెచ్‌పీ, భారత్ గ్యాస్ కస్టమర్లకు అలర్ట్.. వాట్సాప్‌లో క్షణాల్లో సిలిండర్ బుక్ చేసుకోండిలా!
LPG Cylinder Price | గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు అలర్ట్. మీరు గ్యాస్ సిలిండర్‌ను క్షణాల్లో బుక్ చేసుకోవచ్చు. అయితే గ్యాస్ సిలిండర్ బుకింగ్ చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
మనం ఇప్పుడు వాట్సాప్ ద్వారా గ్యాస్ (Gas) సిలిండర్ ఎలా బుక్ చేసుకోవాలో ఒకసారి తెలుసుకుందాం. ఇండేన్, భారత్, హెచ్‌పీ గ్యాస్ కస్టమర్లు వాట్సాప్ (Whatsapp) ద్వారానే సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. సిలిండర్ బుకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.
ఇండేన్ గ్యాస్ కస్టమర్లు అయితే 7588888824 నెంబర్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. ముందుగా ఈ నెంబర్‌ను ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. తర్వాత వాట్సాప్‌లోకి వెళ్లాలి. ఈ నెంబర్‌ను ఓపెన్ చేయాలి. తర్వాత బుక్ లేదా రిఫిల్ అనే టైప్ చేసి మెసేజ్ సెండ్ చేయాలి. ఇప్పుడు మీకు ఇప్పుడు ఆర్డర్ కంప్లీట్ అయినట్లు రిప్లే వస్తుంది. ఇందులో సిలిండర్ డెలివరీ డేట్ కూడా ఉంటుంది. మీరు మీ సిలిండర్ స్టేటస్ తెలుసుకోవాలని భావిస్తే.. స్టేటస్ అని టైన్ చేసి సెండ్ చేయాలి. మీ సిలిండర్ స్టేటస్ తెలుస్తుంది.
హెచ్‌పీ గ్యాస్ కస్టమర్లు అయితే వాట్సాప్ ద్వారా సిలిండర్ ఎలా బుక్ చేయాలో ఇప్పుడు చూద్దాం. వీళ్లు 9222201122 నెంబర్ ద్వారా సిలిండర్ బుక్ చేయాల్సి ఉంటుంది. ఈ నెంబర్‌ను మీరు ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. తర్వాత వాట్సాప్ లోకి వెళ్లి ఈ నెంబర్‌కు బుక్ అనే మెసేజ్ పంపాల్సి ఉంటుంది. లేదంటే మీరు హయ్ అని పంపినా సరే మీకు రిప్లే వస్తుంది. ఆప్షన్లు ఉంటాయి. మీకు నచ్చిన ఆప్షన్ ఎంచుకోవచ్చు. బుకింగ్ ఆప్షన్ ఎంచుకుంటే సిలిండర్ అవుతుంది. మీకు కన్ఫర్మేషన్ వస్తుంది.
అదే భారత్ గ్యాస్ అయితే వాట్సాస్ ద్వారా సిలిండర్ బుక్ చేసుకోవాలని భావిస్తే.. 1800224344 నెంబర్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఇకపోతే పేటీఎం ద్వారా అయితే మీరు ఏ సిలిండర్ వాడుతున్నా కూడా క్షణాల్లో బుక్ చేసుకోవచ్చు. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉంటే చాలు. కేవలం పేటీఎంలో మాత్రమే కాకుండా ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా కూడా మీరు సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. క్షణాల్లో సిలిండర్ బుక అవుతుంది. ఇక్కడ కూడా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. క్రెడిట్ కార్డు ద్వారా సిలిండర్ బుక్ చేసుకోవాలని భావించే వారు ఎందులో అయితే ఆఫర్లు ఉన్నాయో చెక్ చేసుకొని ఆ ప్లాట్‌ఫామ్ ద్వారా సిలిండర్ బుక్ చేసుకోవచ్చు.
0 Comments:
Post a Comment