Lower berth - రైల్వే శాఖ కీలక నిర్ణయం - లోయర్ బెర్తులు ఇక వారికి రిజర్వ్..!!
రైల్వే శాఖ కాలక నిర్ణయం తీసుకుంది. లోయర్ బెర్తుల కేటాయింపు విషయంలో స్పష్టత ఇచ్చింది. దివ్యాంగుల ఊరటనిచ్చే ప్రకటన చేసింది. వారితో పాటుగా కుటుంబీకులకు అమలయ్యే విధాన పరమైన నిర్ణయాన్ని వెల్లడించింది.
గతంలో దివ్యాంగుల ప్రయోజనం కోసం రైల్వే రిజర్వేషన్ కేంద్రాలను సంప్రదించకుండానే ఐఆర్సిటిసి ద్వారా ఆన్‌లైన్ బుకింగ్ చేసుకునేందుకు రైల్వే శాఖ అవకాశం కల్పించింి. ఇప్పుడు వీరికి సంబంధించి మరో కీలక నిర్ణయం ప్రకటించింది.
రైలులో దివ్యాంగుల ప్రయాణం మరింత సులభతరం కానున్నది. ప్రయాణ సమయంలో సౌకర్యవంతమైన వసతిని నిర్ధారించేందుకు దివ్యాంగులతో పాటు కుటుంబీకులకు మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలోని ప్రతి బోగిలో లోయర్ బెర్తులను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. స్లీపర్ క్లాస్‌లో నాలుగు బెర్త్‌లు (రెండు లోయర్, రెండు మిడిల్), థర్డ్ ఏసీలో రెండు బెర్త్‌లు (ఒకటి లోయర్, ఒకటి మిడిల్), థర్డ్ ఈ క్లాస్‌లో రెండు (ఒకటి లోయర్, మరొకటి మిడిల్) బెర్త్‌లు దివ్యాంగులకు రిజర్వ్ చేస్తున్నట్లు రైల్వేశాఖ పేర్కొంది.
ఒంటరిగా ప్రయాణించే లేదంటే చిన్న పిల్లలతో ప్రయాణించే వృద్ధులు, మహిళలకు ఈ సౌకర్యాన్ని ఇప్పటికే రైల్వే శాఖ కల్పించింది. గరీబ్‌రథ్‌లో రెండు లోయర్, రెండు అప్పర్ బెర్తులు దివ్యాంగులకు కేటాయించారు. అదే సమయంలో చైర్‌కార్ రైళ్లలోనూ రెండు సీట్లు వికలాంగులకు కేటాయించనున్నారు. నాలుగు కేటగిరీల్లో రైల్వే రాయితీని ఇస్తుంది. ఆర్థోపెడికల్ దివ్యాంగులు, మెంటల్లీ రిటార్డెడ్ వ్యక్తులు తోడు లేకుండా ప్రయాణం చేయలేరని, అంధులు, చెవిటి-మూగ వ్యక్తులు ఒంటరిగైనా.. సహాయకుడితో కలిసి ప్రయాణం చేయవచ్చని రైల్వేశాఖ పేర్కొంది. ఇదే సమయంలో గతంలో ఇచ్చిన విధంగా సీనియర్ సిటిజెన్స్ కు టికెట్ల రాయితీ అంశంలో రైల్వే శాఖపై ఒత్తిడి పెరుగుతోంది. దీని పైన త్వరలో నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.
0 Comments:
Post a Comment