Kumkuma : మన వాస్తు శాస్త్రంలో కుంకుమకు ప్రాధాన్యం ఉంటుంది. కుంకుమతో మనం శుభ కార్యాలు నిర్వహించుకోవడంలో ప్రధాన భూమిక పోషిస్తుంది. ఇంట్లో జరిగే కార్యాలన్నింటికి దీంతోనే ప్రారంభం చేస్తుంటారు.
శుభ సంకేతాలకు మరో రూపమే కుంకుమ. ఈ నేపథ్యంలో కుంకుమ వాడకం గురించి మనకు మంచి ఫలితాలు వస్తాయని నమ్మకం కలుగుతుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి కుంకుమ శుభాలు కలిగిస్తుంది. ప్రతి రోజు మనం స్నానం చేసే నీటిలో కుంకుమ వేసుకుని తరువాత సూర్యుడికి అర్జ్యం ఇస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
తూర్పు వైపు తిరిగి సూర్యుడికి అర్జ్యం ఇస్తే ఆరోగ్యం సిద్ధిస్తుందని నమ్ముతుంటారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కాలంటే కూడా కుంకుమ ఉపయోగపడుతుంది.
ఆంజనేయుడికి ఇష్టమైన మంగళవారం జాస్మిన్ ఆయిల్ తో సింధూరం కలిపి సమర్పిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలా ఐదు వారాలు చేయడం వల్ల దేవుడి దయ మన మీద పడుతుంది.
ఇలా చేయడం వల్ల మన ఆర్థిక సంక్షోభాలు దూరమవుతాయి. ఇంట్లో అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. కుంకుమ కలిపిన నీళ్లతో దిష్టి తీసి ప్రవహించే నీళ్లలో కలిపితే ప్రయోజనం కలుగుతుంది.
ఆర్థిక సమస్యలు దూరం కావాలంటే బుధవారం వినాయకుడికి కుంకుమ సమర్పిస్తే చాలు. ఇంటి గడపకు పసుపుతో పాటు కుంకుమ పూయడం కూడా మంచి శ్రేయస్సు కలగజేస్తుంది.
ముత్తయిదువలు స్నానం చేసిన తరువాత పార్వతీ దేవికి కుంకుమతో పూజ చేస్తే మంచి జరుగుతుందని నమ్ముతుంటారు. ఇలా కుంకుమతో మనకు ఎన్నో లాభాలు కలుగుతాయని చెబుతుంటారు.
0 Comments:
Post a Comment