కోణార్క్ సూర్య దేవాలయం గురించిన ఆసక్తికరమైన విషయాలు
భారతదేశంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా లక్షలాది ఆలయాలున్నాయనడంలో సందేహం లేదు.
ఈ దేవాలయాలు శివుడు, విష్ణువు, దుర్గ, రాముడు వంటి హిందూ దేవతలకు అంకితం చేయబడ్డాయి. కానీ, సూర్య భగవానుడుగా భావించే సూర్యునికి అంకితం చేయబడిన దేవాలయాలు భారతదేశంలో కొన్ని మాత్రమే ఉన్నాయని మీకు తెలుసా? అలాంటి దేవాలయాల్లో ఒడిశా రాష్ట్రం పూరీ జిల్లాలోని కోణార్క్ పట్టణంలో ఉన్న కోణార్క్ సూర్య దేవాలయం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది.
ఈ ఆలయానికి సంబందించిన విషయాలు చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే, ఈ ఆలయం గురించిన మరి కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీతో పంచుకోబోతున్నాం.
పురాతణ ఆలయంగానే కాకుండా చారిత్రక నేపథ్యం ఉన్న ఇక్కడి విశేషాలు తెలుసుకునేందుకు నిత్యం ఔత్సాహికులు ఆసక్తిని చూపిస్తునే ఉంటారు.
కోణార్క్ సూర్య దేవాలయం ఒడిశాలోని పూరిలో భారతదేశ తూర్పు తీరంలో ఉంది. ఇది ఆ రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ నుండి దాదాపు 65 కిలోమీటర్ల దూరంలో కొలువై ఉంది. కోణార్క్ సూర్య దేవాలయం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు పొందింది.
దీని అద్భుతమై నిర్మాణశైలికి జతచేయబడిన క్లిష్టమైన రాతి శిల్పాలు కోణార్క్ సూర్య దేవాలయానికి ఆ స్థానాని అందించాయడలంలో సందేహమే లేదు. అంతేకాదు, వాస్తు శాస్త్రానికి సంబంధించి భారతదేశంలోని అత్యంత ఆకర్షణీయమైన దేవాలయాలలో ఇది ఒకటిగా ప్రసిద్ధి పొందింది ఈ ఆలయం.
గొప్ప సాంస్కృతిక ప్రాముఖ్యత
ఈ ఆలయం సూర్య దేవునికి అంకితం చేయబడింది. అందుకే, దీనిని సూర్య దేవాలయం అని కూడా పిలుస్తారు. ఆశ్చర్యకరంగా, సూర్య దేవాలయాలు భారతదేశంలోని ఇతర దేవాలయాల వలె ప్రాచుర్యం పొందలేదు.
కానీ అవి గొప్ప సాంస్కృతిక మరియు మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. అందుకే ఈ దేవాలయం ప్రత్యేతను సంతరించుకుంది.
భారతదేశంలోని కొన్ని ముఖ్యమైన సూర్య దేవాలయాలు పరిశీలిస్తే, ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం, గుజరాత్‌లోని మోధేరా సూర్య దేవాలయం మరియు కాశ్మీర్‌లోని మార్తాండ్ సూర్య దేవాలయాలు ఎంతో పేరుగాంచిన ఆలయాలుగా రికార్డులకు ఎక్కాయి.
వాస్తు అద్భుతం
ఈ ఆలయం నిర్మాణంలో ప్రతి అంగుళం వాస్తు అద్భుతంగా చెబుతారు. మరీ ముఖ్యంగా ఈ ఆలయం రథం ఆకారంలో ఉంటుంది. చూపరుల మనసుదోచేంతగా అద్భుతంగా చెక్కబడిన చక్రాలు మరియు దూకుతున్న గుర్రాలు సజీవరూపాన్ని సంతరించుకుంటాయి.
ఆలయ వాస్తుశిల్పం కళింగ నిర్మాణ శైలికి అద్భుతమైన ఉదాహరణ. ఈ ఆలయంలో హిందూ పురాణాల దృశ్యాలను వర్ణించే విస్తృతమైన రాతి శిల్పాలను చూడవచ్చు. అలనాటి చారిత్రక జ్ఞాపకాలను నెమరువేసుకునేందుకు కోణార్క్ సూర్య దేవాలయం గొప్ప గమ్యస్థానంగా చెప్పబడుతోంది.
కోణార్క్ వద్ద ఖగోళ శాస్త్రం
సూర్యుని యొక్క మొదటి కిరణాలు ఆలయ ప్రధాన ద్వారం మీద పడతాయి. ఐకానిక్ వీల్ కూడా సూర్యరశ్మిలా పనిచేస్తుందన్న విషయం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అంతేకాదు, ఇది ఖచ్చితమైన సమయాన్ని చెబుతుంది.
అలనాటి ఇంజనీరింగ్ ప్రతిభాప్రావిణ్యానికి ఈ ఆలయం మచ్చుతునకగా నిలుస్తుంది. కోణార్క్ వద్ద ఖగోళ శాస్త్రం భవిష్యత్తు తరాల వారికి గొప్ప విజ్ఞానాన్ని అందిస్తుందనడంలో సందేహమే అక్కర్లేదు. మరెందుకు ఆలస్యం ఈ పురాతణ నిర్మాణాన్ని చూసేందుకు వెంటనే బయలుదేరండి.
0 Comments:
Post a Comment