అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి ఇండియా మరో సరికొత్త విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ప్రపంచంలో ఇంత వరకు ఏ దేశం చేపట్టని ప్రయోగాన్ని స్వదేశీ పరిజ్ఞానంతో నిర్వహించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.
కర్ణాటక- చిత్రదుర్గలోని ఎరోనాటికల్ టెస్ట్ రేంజ్ ఏటీఆర్‌లో ఆదివారం ఉదయం 7 గంటల 10 నిమిషాలకు ఈ ప్రయోగం మొదలైంది.
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన చీనూక్ హెలికాప్టర్ ఈ సరికొత్త ప్రయోగంలో కీలక భూమిక పోషించింది.
రీయూజబుల్ లాంచ్ వెహికిల్- ఆటనామస్ ల్యాండింగ్ మిషన్ -RLV-LEXని ఈ హెలికాప్టర్ మోసుకెళ్లింది.
RLV-TD అంటే రెక్కలతో కూడిన ఒక ప్రయోగవాహకం. హెలికాప్టర్ దిగువ భాగంలో దీన్ని వేలాడదీశారు. దీన్ని మోసుకుంటూ చీనూక్ హెలికాప్టర్ ఆకాశంలోకి ఎగిరింది.
భూమి నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తుకు ఎగిరిన తర్వాత చీనూక్ హెలికాప్టర్ 4.6 కిలోమీటర్ల ఎత్తులో ఈ వాహాకాన్ని భూమి వైపు వదిలేసింది. ఈ ల్యాండింగ్ ఎక్స్‌పెరిమెంట్‌ను చిత్రదుర్గలోని ATR సెంటర్ నుంచి ఇస్రో , IAF అధికారులు మానిటర్ చేశారు.
కంప్యూటర్ కమాండ్ ద్వారా ఈ ఆపరేషన్ మొత్తాన్ని నిర్వహించారు. రెక్కలతో కూడిన వాహకాన్ని ఇలా హెలికాప్టర్ ద్వారా ఆకాశంలోకి 4.5 కిలోమీటర్ల ఎత్తుకు మోసుకెళ్లడం, అక్కడి నుంచి కిందకు వదిలి అనుకున్న ప్రదేశంలో ల్యాండ్ అయ్యేలా చేసిన ఈ ప్రయోగం ప్రపంచంలోనే మొట్టమొదటిది.
సరిగ్గా ఉదయం 7 గంటల 40 నిమిషాలకు ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్ తనంతట తానుగా ఎయిర్ స్ట్రిప్‌పై ల్యాండ్ అయింది.
వినూత్నంగా రూపొందించిన ఈ RLV-TD ఎయిర్‌క్రాఫ్ట్ లాంటిదే. లాంచ్ వెహికల్, ఎయిర్‌క్రాఫ్ట్ సామర్ధ్యాన్ని, సంక్లిష్టత రెండింటిని కలిగి ఉండటం దీని ప్రత్యేకత అని ఇస్రో అధికారులు తెలిపారు.
ఇంటిగ్రేటెడ్ నావిగేషన్, గైడెన్స్ అండ్ కంట్రోల్ సిస్టమ్, సూడోలైట్ సిస్టమ్, కేఎ బ్యాండ్ రాడర్, ఆల్టీమీటర్, న్యావ్ ఐసీ రిసీవర్ వంటి అత్యాధునిక పరిజ్ఞానంతో పనిచేసిన ఈ RLV- స్వతంత్రంగా ఎయిర్ స్ట్రిప్‌పై ల్యాండ్ అయింది.
దీని ద్వారా స్వతంత్రంగా అంతరిక్ష నౌకను విజయవంతంగా ల్యాండ్ చేసిన ఘనతను ఇస్రో సొంతం చేసుకుంది.
ఏ మార్గం నుంచైతే ఇది ఆకాశంలోకి వెళ్లిందో తిరిగి అదే మార్గం నుంచి మనుషుల ప్రమేయం లేకుండా అంతే కచ్చితత్వంతో అంతరిక్షం నుంచి వచ్చినట్టు ఈ రీయూజబుల్ లాంఛ్ వెహికల్ ల్యాంగ్ అయింది.
ఈ RLV-LEXకు సమకాలీన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చడం ద్వారా తక్కువ ఖర్చుతో లాంఛ్ వెహికల్ ప్రయోగాలు చేపట్టడం సుసాధ్యమవుతుంది.
ఇదిలా ఉంటే ఈ తరహా ప్రయోగాన్ని 2016లోనే ఇస్రో చేపట్టింది. దానికి మెరుగులద్ది సాంకేతికంగా మరింత మెరుగు పరిచి తాజాగా లాంచ్ చేసింది
0 Comments:
Post a Comment