1. చార్‌ధామ్ యాత్ర (Char Dham Yatra) మళ్లీ ప్రారంభం కాబోతోంది.
కేదార్‌నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి దర్శించుకోవాలనుకునేవారి కోసం ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism) ప్రత్యేక టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. న్యూ ఢిల్లీ నుంచి ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. మే 1, మే 15, జూన్ 1, జూన్ 15, సెప్టెంబర్ 1, సెప్టెంబర్ 15 తేదీల్లో ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఇది 11 రాత్రులు, 12 రోజుల టూర్ ప్యాకేజీ. ఈ టూర్ ప్యాకేజీలో కేదార్‌నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి కవర్ అవుతాయి. ఈ ప్యాకేజీ బుక్ చేసుకునే పర్యాటకులు ముందుగా చార్‌ధామ్ యాత్రకు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ టూర్ ప్యాకేజీ ఎలా సాగుతుందో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఐఆర్‌సీటీసీ చార్‌ధామ్ యాత్ర మొదటి రోజు ఢిల్లీలో ప్రారంభం అవుతుంది. రోడ్డు మార్గంలో హరిద్వార్ బయల్దేరాలి. రాత్రికి హరిద్వార్ చేరుకుంటారు. రెండో రోజు హరిద్వార్ నుంచి బార్‌కోట్ బయల్దేరాలి. మూడో రోజు యమునోత్రి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. పర్యాటకులు సొంత ఖర్చులతో పోనీ, పల్లకి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. నాలుగో రోజు ఉత్తరకాశీ బయల్దేరాలి. బ్రహ్మకాల్ దగ్గర ప్రకటేశ్వర్ మహాదేవ్ ఆలయాన్ని దర్శించుకోవచ్చు. సాయంత్రం కాశీ విశ్వనాథ్ ఆలయ సందర్శన ఉంటుంది. రాత్రికి ఉత్తరకాశీలో బస చేయాలి. ఐదో రోజు గంగోత్రి బయల్దేరాలి. భగీరథి నది గుండా ప్రయాణించవచ్చు. గంగోత్రి ఆలయంలో గంగాదేవీ దర్శనం ఉంటుంది. ఆరో రోజు గుప్తకాశీ, సీతాపూర్ బయల్దేరాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఏడో రోజు సోన్‌ప్రయాగ్ దగ్గర కేదార్‌నాథ్ వెళ్లేందుకు పోనీ, పల్లకి సేవల్ని బుక్ చేసుకోవాలి. సాయంత్రం కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించుకోవాలి. సాయంత్రం హారతి దర్శనం ఉంటుంది. రాత్రికి కేదార్‌నాథ్‌లో బస చేయాలి. ఎనిమిదో రోజు కేదార్‌నాథ్ అలయంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు. ఆ తర్వాత గుప్తకాశీ బయల్దేరాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6. తొమ్మిదో రోజు బద్రీనాథ్ బయల్దేరాలి. దారిలో జోషీమఠ్‌లో నర్సింగ్ స్వామి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. సాయంత్రం బద్రీనాథ్ చేరుకుంటారు. ఆ తర్వాత బద్రీనాథ్ ఆలయాన్ని దర్శించుకోవచ్చు. రాత్రికి బద్రీనాథ్‌లో బస చేయాలి. పదో రోజు బద్రీనాథ్ ఆలయంలో అభిషేకం, అలంకార దర్శనం ఉంటుంది. పదకొండో రోజు రుద్రప్రయాగ్ బయల్దేరాలి. సాయంత్రం గంగా హారతి దర్శించుకోవచ్చు. రాత్రికి హరిద్వార్‌లో బస చేయాలి. పన్నెండో రోజు తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఐఆర్‌సీటీసీ చార్‌ధామ్ యాత్ర ప్యాకేజీ ధరలు చూస్తే ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.59,360, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.62,790, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.88,450 చెల్లించాలి. టూర్ ప్యాకేజీలో ఏసీ వాహనంలో ప్రయాణం, హోటల్‌లో బస, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
0 Comments:
Post a Comment