Infosys Share: ఇన్ఫోసిస్ సీఈవో ప్రకటనతో కుప్పకూలిన షేర్..! అసలు ఆయన ఏమన్నారంటే..
Infosys Share: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వ్యాపార, ఆర్ధిక పరిస్థితులు ఎవ్వరూ ఊహించని స్థాయిలో దిగజారాయి. ఈ క్రమంలో ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
వ్యాపార వాతావణంలో కంపెనీల విలీనాలు, అక్వజిషన్ల గురించి మాట్లాడారు. తమ దగ్గర మంచి డేటా కూడా ఉందని అన్నారు.
బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఇన్ఫోసిస్ మంచి కొనుగోళ్ల కోసం "అన్ని వేళలా చూడటం"లో ఉందని.. దీనికి సరైన వ్యాపార వాతావరణం ప్రస్తుతం ఉందంటూ పరేఖ్ అన్నారు. ప్రస్తుతం కంపెనీ బలమైన బ్యాలెన్స్ షీట్ కలిగి ఉందని స్పష్టం చేశారు. వ్యూహాత్మకంగా, సాంస్కృతికంగా కూడా సరిపోయే కంపెనీ లేదా ఎంటిటీని కనుగొంటే దానిని కొనుగోలు చేసే మార్గాన్ని పరిశీలిస్తామంటూ వెల్లడించారు.
ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ చేసిన ఈ వ్యాఖ్యలతో నేడు మార్కెట్ల ప్రారంభం నుంచి షేర్లు భారీగా పతనమయ్యాయి. ప్రస్తుత గందరగోళ ఆర్థిక అస్థిరతలు కొనసాగుతున్న వేళ చేసిన వ్యాఖ్యలు షేర్లపై ప్రతికూలంగా ప్రభావితం చేశాయి. ఈ క్రమంలో అమ్మకాల విధ్వంసాన్ని సృష్టించిన ఇన్ఫోసిస్ స్టాక్ ఏకంగా 12 శాతం వరకు కుప్పకూలింది. వేలకోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది.
అమెరికాలో బలహీనమైన స్థూల ఆర్థిక వాతావరణం, ప్రపంచ అస్థిరత విలీనాలు కొనుగోళ్లకు లాభదాయకమైన వాతావరణాన్ని కల్పిస్తున్నాయా అనే ప్రశ్నకు పరేఖ్ బదులిస్తూ పై కామెంట్స్ చేశారు. దీనికి ముందు గతవారాంతంలో ఇన్ఫోసిస్ నాలుగో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. అయితే ఊహించిన దానికంటే తక్కువ లాభాలను నివేదించటంతో మార్కెట్ వర్గాలు నిరాశకు గురయ్యాయి. దేశంలోని రెండవ అతిపెద్ద ఐటీ సేవల కంపెనీగా ఉన్న ఇన్ఫోసిస్ జనవరి-మార్చి త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం సంవత్సరానికి 7.8 శాతం పెరిగి రూ.6,128 కోట్లకు చేరుకుంది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే లాభం ఏడు శాతం క్షీణించింది.
0 Comments:
Post a Comment