హైదరాబాద్: లైఫ్ మెకానికల్‌గా తయారైంది. జీవితమంతా బోరింగ్‌గా మారింది. ఇలా చాలా మంది (ముఖ్యంగా ఉద్యోగస్తులు) అంటూ ఉంటారు.
అయితే, వారికి దొరికిన సమయంలోనే కొంత ఉల్లాసం కోసం వ్యాపకాలు, మిత్రులతో కలయిక, ఇతర పనులు చేసి ఆ ఫేజ్ నుంచి బయటకు వస్తారు.
కానీ, హైదరాబాద్‌లోని అబ్దుల్లాపూర్‌మెట్‌లోని ఓ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ మాత్రం ఇందుకు విరుద్ధం.
ఎంత హోదా గల జాబ్ అనేది కాదు.. తన మనసుకు సంతృప్తి ముఖ్యం అని భావించాడేమో.. ఉద్యోగాన్ని ఉన్నపళంగా వదిలేసి ఎవరికీ చెప్పాపెట్టుకుండా కనిపించకుండా పోయాడు.
అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాన్ని వదిలి ఓ పండ్ల మార్కెట్‌లో కూలీ అవతారమెత్తాడు.
అబ్దుల్లాపూర్‌మెట్‌లోని కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న యువకుడు ఏప్రిల్ 7వ తేదీన కనిపించకుండా పోయాడు. ఆయన ఉంటున్న హాస్టల్‌లోనూ కనిపించలేదు.
బహుశా ఖమ్మంలోని తన సొంతూరికి వెళ్లి ఉంటాడని కాలేజీ సిబ్బంది భావించారు.
ఆ యువకుడి ఇంటికి ఫోన్ చేశారు. తమ కొడుకు ఇంటికి రాలేడని వారు కాలేజీ అధికారులకు చెప్పారు.
కొన్ని రోజుల తర్వాత ఆ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ కొడుకు అదృశ్యమయ్యాడని కంప్లైంట్ ఇచ్చారు. ఇక్కడే పోలీసులకు వారు ఒక ముఖ్యమైన క్లూ ఇచ్చారు.
గతంలోనూ తమ కొడుకు ఇంట్లో చెప్పాపెట్టకుండా వెళ్లిపోయాడని, అప్పుడు ఓ మార్కెట్‌లో కూలీ అవతారమెత్తి సరుకులను మోశాడని వివరించారు.
దీంతో పోలీసులు ఆ కోణంలో ఆలో చించారు. అబ్దుల్లాపూర్‌మెట్‌లోని ఓ పండ్ల మార్కెట్ పై అబ్దుల్లాపూర్‌మెట్ ఇన్‌స్పెక్టర్ సునీల్ కుమార్, ఆయన బృందం ఓ కన్నేసి ఉంచారు.
మంగళవారం ఉదయం ఓ యువ కుడు అక్కడ కూలీగా పని చేయడానికి రావడాన్ని గుర్తించారు. వెంటనే ఆ యువకుడిని అదుపు లోకి తీసుకుని కుటుంబానికి అప్పగించారు. ఆయనకు కౌన్సెలింగ్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేయాలని కుటుంబానికి పోలీసులు సూచించారు.
0 Comments:
Post a Comment